కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Saindhav : బుజ్జికొండవే... ఓ తండ్రి ఆలాపన..

ABN, Publish Date - Dec 30 , 2023 | 05:13 AM

వెంకటేశ్‌ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైంధవ్‌’. ఇది ఆయన 75వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాకోసం రామజోగయ్యశాస్త్రి రాయగా, సంతోశ్‌ నారాయణ్‌

వెంకటేశ్‌ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైంధవ్‌’. ఇది ఆయన 75వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాకోసం రామజోగయ్యశాస్త్రి రాయగా, సంతోశ్‌ నారాయణ్‌ స్వరసారథ్యంలో ఎస్పీ చరణ్‌ ఆలపించిన ‘బుజ్జికొండవే..’ అంటూ సాగే గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు. తండ్రీకూతుళ్ల అనుబంధానికి అద్దం పట్టేలా ఈ పాట సాహిత్యం ఉంటుందని, వెంకటేశ్‌, బేబీ సారా, శ్రద్ధాశ్రీనాథ్‌లపై చిత్రీకరించిన ఈ పాట సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధం ఈ సినిమాకు ప్రధానబలమని, దర్శకుడు శైలేష్‌ కొలను థ్రిల్స్‌తో కూడిన ఇంటెన్స్‌ యాక్షన్‌తో భావోద్వేగాల మేళవింపుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని, వెంకటేశ్‌ కెరీర్‌లోనే ఇది ప్రత్యేకమైన సినిమా అని చిత్రబృదం తెలిపింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌. మణికందన్‌, నిర్మాత: వెంకట్‌ బోయనపల్లి. నిర్మాణం నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌.

Updated Date - Dec 30 , 2023 | 09:25 AM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!