రొమాంటిక్.. హారర్
ABN, First Publish Date - 2023-08-22T00:18:08+05:30
‘రౌడీ బాయ్స్’తో గుర్తింపు తెచ్చుకొన్న యువ హీరో ఆశిష్. ఆమధ్యే ‘సెల్ఫీష్’ అనే మరో చిత్రాన్ని పట్టాలెక్కించారు..
‘రౌడీ బాయ్స్’తో గుర్తింపు తెచ్చుకొన్న యువ హీరో ఆశిష్. ఆమధ్యే ‘సెల్ఫీష్’ అనే మరో చిత్రాన్ని పట్టాలెక్కించారు. 50 శాతం చిత్రీకరణ కూడా పూర్తయింది. ఈలోగా ముచ్చటగా మూడో చిత్రానికీ శ్రీకారం చుట్టేశారు. అరుణ్ భీమవరపు దర్శకుడు. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగార్జున మల్లిడి నిర్మాతలు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి త్రివిక్రమ్ క్లాప్‌నిచ్చారు. రొమాంటిక్ హారర్ జోనర్‌లో ఈ సినిమా సాగుతుందని దర్శక నిర్మాతలు తెలిపారు. సంగీతం: కీరవాణి, ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరామ్.