కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ సెట్స్‌లో రష్మిక..

ABN, First Publish Date - 2023-12-06T21:39:15+05:30

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం తాజాగా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంది.

The Girl Friend Movie Sets

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girl Friend). ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వంలో.. విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైందని తెలుపుతూ.. హీరోయిన్ రష్మిక మందన్నా సెట్‌లో ఉన్న కొన్ని ఫొటోలను మేకర్స్ విడుదల చేశారు.

సెట్‌లోకి అడుగుపెట్టిన హీరోయిన్ రష్మికకు దర్శకుడు రాహుల్ రవీంద్రన్, నిర్మాతలు ఎస్ కేఎన్, ధీరజ్ మొగలినినేని, విద్య కొప్పినీడి వెల్ కమ్ చెప్పారు. రష్మిక, సినిమా టీమ్‌కు అల్లు అరవింద్ తన బ్లెస్సింగ్స్ అందజేశారు. 20 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో రష్మికతో పాటు కీలక నటీనటులు పాల్గొంటారని చిత్రబృందం తెలిపింది.


రష్మిక మందన్నా లీడ్ రోల్‌లో నటిస్తున్న వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రమిది. ఒక సూపర్ హిట్ సినిమాకు పనిచేస్తున్న పాజిటివ్ ఫీలింగ్, కాన్ఫిడెన్స్‌తో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించింది ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ టీమ్. మరో వైపు రష్మిక మందన్నా నటించిన ‘యానిమల్’ (Animal) చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టిస్తున్న విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

====================

*Naa Saami Ranga: నాగ్ ఎత్తికెళ్లిపోతాడంట.. జర జాగ్రత్త!

********************************

*Pushpa Kesava: జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య కేసులో ‘పుష్ప’ నటుడు అరెస్ట్

**********************************

*B-Town: రోడ్డుపై తాగి తూలిన హీరో.. అసలు నిజం ఏమిటంటే..?

**************************************

Updated Date - 2023-12-06T21:39:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!