సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rao Ramesh as Hero : హీరోగా రావు రమేశ్‌!

ABN, First Publish Date - 2023-02-25T04:20:08+05:30

విలక్షణ నటుడు రావు రమేశ్‌ తొలిసారిగా కథను నడిపించే కథానాయకుడి పాత్రను పోషించనున్నారు. ఆ చిత్రం పేరు ‘మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం’...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విలక్షణ నటుడు రావు రమేశ్‌ తొలిసారిగా కథను నడిపించే కథానాయకుడి పాత్రను పోషించనున్నారు. ఆ చిత్రం పేరు ‘మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం’. అయితే ఇది రెగ్యులర్‌ హీరో పాత్ర కాదు. హిందీలో ఆయుష్మాన్‌ ఖురానా, రాజ్‌కుమార్‌ రావు, నవాజుద్దీన్‌ సిద్దిఖి వంటి నటులు చేసే సినిమాల తరహాలో ఆయన పాత్ర, చిత్రం ఉంటాయి. ఈ చిత్రం గురించి దర్శకుడు లక్ష్మణ్‌ కార్య మాట్లాడుతూ ‘ వినోదాత్మక కుటుంబ కథాచిత్రం ఇది. రావు రమేశ్‌ లీడ్‌ రోల్‌ చేయడానికి అంగీకరించడం మా ఫస్ట్‌ సక్సెస్‌. నడివయసులో ఉన్న ఒక మధ్యతరగతి నిరుద్యోగి జీవితంలో ప్రతి క్షణం జరిగే ట్విస్టులతో, రెండు గంటల పాటు ప్రేక్షకులను నవ్వించే సినిమా ఇది. మార్చి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’ అని చెప్పారు. ఇంద్రజ కీలక పాత్ర పోషించే ఈ సినిమాను పీబీఆర్‌ సినిమాస్‌ సంస్థ నిర్మించనుంది.

Updated Date - 2023-02-25T04:20:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!