కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ajagratha: ‘అజాగ్రత’లో కర్ణాటక మాజీ సీఎం భార్య..

ABN, First Publish Date - 2023-11-13T01:32:28+05:30

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భార్య కన్నడ నటి అలియాస్ కుట్టి రాధిక ‘అజాగ్రత’ అనే చిత్రంతో పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకులను పలకరించనున్నారు. కర్ణాటకలో సూపర్ హిట్ బ్యానర్ అయిన శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని శశిధర్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. నటి రాధిక కుమారస్వామి బర్త్‌డే సందర్భంగా చిత్రయూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.

Radhika Kumaraswamy in Ajagratha

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భార్య కన్నడ నటి అలియాస్ కుట్టి రాధిక (Radhika Kumaraswamy) ‘అజాగ్రత’ (Ajagratha) అనే చిత్రంతో పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకులను పలకరించనున్నారు. కర్ణాటకలో సూపర్ హిట్ బ్యానర్ అయిన శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ (Sri Durga Parameshwari Production) ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని శశిధర్ (Shashidhar) భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రాబోతోన్న ఈ మూవీ కోసం అత్యద్భుతమైన సెట్లను వేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి రవి రాజ్ నిర్మాత. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

రాధిక కుమారస్వామి బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం తెరకెక్కుతోన్న ఏడు భాషల్లో ఫస్ట్ లుక్ పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో ఎరుపు రంగు చీర, ఒంటినిండా నగలతో రాధిక నిండుగా కనిపిస్తున్నారు. ఇక పోస్టర్‌లో దీపాల వెలుగులు కూడా కనిపిస్తున్నాయి. దీపావళి (Diwali)కి పర్‌ఫెక్ట్ పోస్టర్‌లా కనిపిస్తోంది.


రాధిక కుమారస్వామి బర్త్ డే (Radhika Kumaraswamy Birthday) సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘ది షాడోస్ బిహెండ్ ది కర్మ’ అనేది ఈ మూవీకి ట్యాగ్‌లైన్. బాలీవుడ్ స్టార్ సైతం ఈ మూవీలో నటించబోతోన్నారు. ఈ యాక్షన్ చిత్రంలో శ్రేయాస్ తల్పడే, సునీల్, రావు రమేష్, ఆదిత్య మీనన్, దేవ్ రాజ్, వినయ ప్రసాద్, శ్రవణ్ ఇలా ఎంతో మంది సౌత్ స్టార్లు నటిస్తున్నారు. (Pan India Film Ajagratha)


ఇవి కూడా చదవండి:

========================

*Lal Salaam Teaser: మరో ‘జైలర్’ని తలపించిన మొయిద్దీన్ భాయ్‌

*****************************

*Family Star: పోస్టర్‌తో ‘ఫ్యామిలీ స్టార్’ దీపావళి సందడి

****************************

*Hansika: మ్యారేజ్ తర్వాత మరింత బిజీగా.. హన్సిక స్పందనిదే!

******************************

Updated Date - 2023-11-13T01:32:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!