కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pyaari: స్వేచ్ఛను - స్వచ్ఛమైన ప్రేమను కోరుకునే ఓ అమ్మాయి కథ

ABN, First Publish Date - 2023-09-13T19:45:29+05:30

మధ్యప్రదేశ్‌లో ఓ అమ్మాయి జీవితంలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా హిందీ - తెలుగు భాషల్లో తెరకెక్కిన హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ‘ప్యారీ’. ‘తారావలి - ది ట్రూ స్టోరీ’ అనేది ట్యాగ్‌లైన్. పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పలు విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం హిందీ - తెలుగు భాషల్లో అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Pyaari Movie Press Meet

మధ్యప్రదేశ్‌లో ఓ అమ్మాయి జీవితంలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా హిందీ - తెలుగు భాషల్లో తెరకెక్కిన హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ‘ప్యారీ’ (Pyaari). ‘తారావలి - ది ట్రూ స్టోరీ’ (Taravali The True Story) అనేది ట్యాగ్‌లైన్. పలు సూపర్ హిట్ హిందీ ధారావాహికలు, వీడియో ఆల్బమ్స్‌లో నటించి, నటిగా మంచి గుర్తింపు పొందిన డాలి తోమర్ (Dolly Tomar) టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని.. ఓంషీల్ ప్రొడక్షన్స్ (Om Sheel Productions) పతాకంపై కల్పన తోమర్-అమిత్ గుప్తా సంయుక్తంగా నిర్మించారు. రహమాన్ అలి - రాజారామ్ పాటిదార్ సహ నిర్మాతలు. పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పలు విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం హిందీ - తెలుగు భాషల్లో అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమాగా తెరకెక్కడానికి ముందే పుస్తక రూపంలో వెలువడి లక్షలాది పాఠకుల మనసులు దోచుకున్న ‘ప్యారీ’ రచయిత రజనీష్ దూబే ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతోపాటు లక్ష్మణ్ పాత్రను పోషించడం విశేషం. అంతేకాదు... ఆర్.పి.సోనితో కలిసి ఈ చిత్రానికి సంగీత సారథ్యం సైతం వహించారు. కొన్ని కాలాలపాటు... మళ్లీ మళ్లీ వినాలనిపించేలా మాత్రమే కాదు, చూసినకొద్దీ మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ‘ప్యారీ’ చిత్రంలోని గీతాలు రూపొందడం గమనార్హం.


ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజారామ్ పాటిదార్, జిగ్నేష్ షా, మనీషా సింగ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ‘ప్యారీ’ పెద్ద హిట్ కావాలని కోరుకున్నారు. చిత్ర కథానాయిక డాలి తోమర్, రచయిత - నటుడు - దర్శకుడు రజనీష్ దూబే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ.. స్వేచ్ఛను - స్వచ్ఛమైన ప్రేమను కోరుకునే ఓ మగువ మనసును ఎంతో హృద్యంగా ఆవిష్కరిస్తూ రూపొందిన ‘ప్యారీ’.. ఇప్పటివరకు భారతీయ తెరపై రూపొందిన అత్యుత్తమ ప్రేమ కథా చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*A R Rahman: రెహ్మాన్‌కు మద్దతు

************************************

*Dil Raju: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కోసం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా..

************************************

*Samyuktha Menon: క‌ళ్యాణ్ రామ్ ‘డెవిల్’‌లో సంయుక్త ఫస్ట్ లుక్ వదిలారు

***********************************

*Thalaivar171: రజనీకాంత్ 171వ చిత్రం ఎవరితోనో తెలుసా?

**********************************

Updated Date - 2023-09-13T19:45:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!