Bunny Vas: గీతా ఆర్ట్స్‌లో ఆ గీత కరెక్ట్‌గా ఉంటుంది
ABN, First Publish Date - 2023-02-21T21:29:15+05:30
నేను తీసిన అన్ని సినిమాలలోకెల్లా త్వరగా బ్రేక్ ఈవెన్ అయిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) అని అన్నారు
నేను తీసిన అన్ని సినిమాలలోకెల్లా త్వరగా బ్రేక్ ఈవెన్ అయిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) అని అన్నారు నిర్మాత బన్నీ వాసు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), కశ్మీర పరదేశి (Kashmira Paradesi) హీరోహీరోయిన్లుగా జీఏ2 పిక్చర్స్ (GA2 Pictures) బ్యానర్‌పై మురళీ కిషోర్ అబ్బూరు (Murali Kishor Abburu) దర్శకత్వంలో బన్నీ వాసు (Bunny Vas) నిర్మించిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పించారు. ఈ మూవీ ఫిబ్రవరి 18న మహాశివరాత్రి రోజున విడుదలై.. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా చిత్రయూనిట్ తమ సంతోషాన్ని వ్యక్తం చేసేందుకు తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. (VBVK Success Meet)
ఈ కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. నిర్మాతగా నేను ఈ సినిమా పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. నేను తీసిన అన్ని సినిమాలలో త్వరగా బ్రేక్ ఈవెన్ అయిన చిత్రమిది. కొత్త వారి మీద చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారా? అని అంతా అడుగుతున్నారు. అరవింద్‌గారి వద్ద ఉన్న క్రమశిక్షణ వల్లే ఖర్చు హద్దుల్లోనే ఉండగలిగింది. అదే మా టీం సక్సెస్ సీక్రెట్. మా టీం వల్లే ఇదంతా సాధ్యమైంది. చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు తీసినప్పుడు లగ్జరీని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. గీతా ఆర్ట్స్‌లో ఆ గీత కరెక్ట్‌గా ఉంటుంది. ఈ సినిమాను మా డైరెక్టర్ గారు తీర్చిదిద్దిన విధానం చూసి ముచ్చటేసింది. నేను ఎప్పటి నుంచో అనుకున్న సీన్లను అద్భుతంగా తీశారు. ఆర్ఆర్‌లో విష్ణుతత్త్వాన్ని చెబుతూ వచ్చారు.
ఈ సినిమాలోని ట్విస్టులు, కథ, నిడివి విషయంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ నేను మాత్రం సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాను. ఇప్పుడిప్పుడే కేజీయఫ్, విక్రమ్ వంటి ఫార్మాట్లకు అలవాటుపడుతున్నారు.. నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేతో సినిమా తీయాలని కొత్తగా డైరెక్ట్ చేయాలని వచ్చే వారికి ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను తీశాం. చేతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj)లో ఇంత టాలెంట్ ఉందని నాకు ఇంతకు ముందు తెలియదు. కిరణ్ అబ్బవరం మాకు ఎంతో సహకరించారు. మా ప్రతీ మాటను అర్థం చేసుకున్నారు. కిరణ్ ఎంతో హంబుల్‌గా ఉంటారు. మా ఫ్యామిలీ మెంబర్‌లా కలిసిపోయారు. కశ్మీర చాలా బిజీగా ఉన్నా కూడా మాకు ఎంతో టైం ఇచ్చారు. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని సక్సెస్ చేసినందుకు వారికి, మీడియా వారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. (Bunny Vas about VBVK Success)
డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు మాట్లాడుతూ.. ఇది కేవలం నంబర్ నైబర్ కాన్సెప్ట్ కోసం తీసిన సినిమా కాదని అన్నారు. అమ్మ సెంటిమెంట్‌తో పాటు.. ఆడపిల్ల కంట్లో నీళ్లు వస్తే విష్ణు ఏం చేస్తారో చెప్పే కథ ఇది. మంచి అనేది వ్యాప్తి చెందడానికి టైం పడుతుంది. కానీ అది స్టార్ట్ అయితే మాత్రం ఆగదు. ఆ డైలాగ్ మాకు సరిగ్గా సరిపోతుందని తెలిపారు. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన థ్యాంక్స్ చెప్పారు.