కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Capture: స్టార్ హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక భయపెట్టేస్తోంది..

ABN, First Publish Date - 2023-11-12T19:15:31+05:30

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర భార్య ప్రియాంక ప్రయోగాత్మక చిత్రం ‘క్యాప్చర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇంత వరకు సినీ ప్రపంచంలో రానటువంటి ఓ ఆసక్తికర అంశంతో ఆమె ప్రయోగం చేయబోతున్నారు. ఆ ప్రయోగం ఏమిటంటే.. సినిమా మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ నుంచి షూట్ చేసినట్టుగా అనిపించడమే. తాజాగా ప్రియాంక బర్త్‌డే‌ను పురస్కరించుకుని మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ని విడుదల చేశారు.

Priyanka Upendra in Capture Movie

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర భార్య ప్రియాంక (Priyanka Upendra) ప్రయోగాత్మక చిత్రం ‘క్యాప్చర్’ (Capture)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇంత వరకు సినీ ప్రపంచంలో రానటువంటి ఓ ఆసక్తికర అంశంతో ఆమె ప్రయోగం చేయబోతున్నారు. ఆ ప్రయోగం ఏమిటంటే.. సినిమా మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ నుంచి షూట్ చేసినట్టుగా (CCTV point of view) అనిపిస్తుంది. సింగిల్ లెన్స్‌తో తీసిన మొట్ట మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. దర్శకుడు లోహిత్. హెచ్ (Lohith H) ఎప్పుడూ కూడా కొత్త పాయింట్‌తోనే సినిమాలు తీస్తుంటారు. ప్రియాంక ఉపేంద్ర, లోహిత్ కాంబోలో ఇది వరకు ‘మమ్మీ, దేవకి’ వంటి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మరో ప్రయోగాత్మక చిత్రమైన ‘క్యాప్చర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని షమికా ఎంటర్‌ప్రైజెస్, శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్ల‌పై రవి రాజ్ నిర్మిస్తున్నారు. రాధికా కుమారస్వామి (Radhika Kumaraswamy) ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా హీరోయిన్ ప్రియాంక ఉపేంద్ర పుట్టినరోజు (Priyanka Upendra Birthday)ను పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.


ఈ పోస్టర్‌ను గమనిస్తే ప్రియాంక మొహం మీద తీవ్ర గాయాలు కనిపిస్తున్నాయి. ఇక ఆమె చుట్టూ సీసీటీవీ కెమెరాలు కనిపిస్తున్నాయి. వాటి మధ్యలో ఓ కాకి కనిపిస్తోంది. వ్యక్తుల చేతులు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా అయితే అర్థమవుతోంది. ఈ మూవీ షూటింగ్ అంతా కూడా గోవాలోనే జరిగిందని.. 30 రోజుల పాటు నిరవధికంగా చిత్రీకరించారని.. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని మేకర్స్ చెబుతున్నారు. (Capture Movie Poster)

శివ రాజ్ కుమార్ ‘తగరు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మన్విత కామత్ (Manvita Kamath) ఈ చిత్రంలో ఓ కీ రోల్ పోషిస్తున్నారు. మాస్టర్ కనిష్‌రాజ్ (Master Kanishraj) ఈ చిత్రంతో బాలనటుడిగా పరిచయం కాబోతున్నారు. పాండికుమార్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, రవిచంద్రన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. (Capture Movie Update)


ఇవి కూడా చదవండి:

========================

*Lal Salaam Teaser: మరో ‘జైలర్’ని తలపించిన మొయిద్దీన్ భాయ్‌

*****************************

*Family Star: పోస్టర్‌తో ‘ఫ్యామిలీ స్టార్’ దీపావళి సందడి

****************************

*Hansika: మ్యారేజ్ తర్వాత మరింత బిజీగా.. హన్సిక స్పందనిదే!

******************************

*Chandramohan: అడుగు ఎత్తు ఎక్కువుంటేనా.. ఏఎన్నార్‌ మాటలకు చంద్రమోహన్ ఏమనేవారంటే..

*********************************

Updated Date - 2023-11-12T19:15:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!