Pedakapu : ప్రేక్షకుల మనసుల్ని కదిలించిన పెదకాపు
ABN, First Publish Date - 2023-10-02T01:31:55+05:30
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన చిత్రం ‘పెదకాపు 1’ ఈవారమే విడుదలైంది. విరాట్ కర్ణ హీరోగా పరిచయం అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు...
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన చిత్రం ‘పెదకాపు 1’ ఈవారమే విడుదలైంది. విరాట్ కర్ణ హీరోగా పరిచయం అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఓ మంచి సినిమా ఇవ్వాలన్న కృత నిశ్చయంతో మేమంతా ఓ టీమ్‌గా ప్రయత్నించాం. మా కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింద’’న్నారు. ‘‘ప్రేక్షకుల మనసుల్ని కదిలించిన సినిమా ఇది. ‘పెదకాపు’తో ఓ మంచి హీరో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టాడని ప్రేక్షకులు కితాబు ఇస్తున్నార’’ని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తెలిపారు. ‘‘ఓ కొత్త హీరోని నమ్మి ఇంత గ్రాండ్‌గా సినిమా తీసిన నిర్మాతకు రుణపడి ఉంటా. సినిమా చాలా గ్రాండ్‌గా ఉందని ప్రేక్షకులు మెచ్చుకొంటున్నార’’న్నారు విరాట్ కర్ణ.