కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పరమశివుడిగా ప్రభాస్‌?

ABN, First Publish Date - 2023-09-11T01:52:21+05:30

విష్ణు మంచు టైటిల్‌ పాత్రలో నటి స్తున్న చిత్రం ‘భక్త కన్నప్ప’. ఆయనే నిర్మిస్తున్నారు. ఇటీవలే పట్టాలెక్కిన ఈ చిత్రంలో మరో టాలీవుడ్‌ అగ్రన టుడు భాగం అవుతున్నారు...

విష్ణు మంచు టైటిల్‌ పాత్రలో నటి స్తున్న చిత్రం ‘భక్త కన్నప్ప’. ఆయనే నిర్మిస్తున్నారు. ఇటీవలే పట్టాలెక్కిన ఈ చిత్రంలో మరో టాలీవుడ్‌ అగ్రన టుడు భాగం అవుతున్నారు. ప్రభాస్‌ ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని విష్ణు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఆయన ‘హరహర మహదేవ్‌’ అని ట్వీట్‌ చేయడంతో ఈ చిత్రంలో ప్రభాస్‌ పరమశివుడి పాత్రలో కనిపించనున్నారని అభిమానులు భావిస్తున్నారు. ప్రభాస్‌ కూడా ఈ చిత్రంలో భాగమవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి ‘మహాభారత్‌’ సిరీస్‌ ఫేమ్‌ ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వ హిస్తున్నారు. నుపుర్‌ సనన్‌ కథానాయిక. న్యూజిలాండ్‌లో సింగిల్‌ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తామని విష్ణు గతంలో తెలిపారు.

Updated Date - 2023-09-11T01:52:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!