Perfume: బిగ్‌బాస్ ఫేమ్ భోళే, భీమ్స్ వదిలిన ‘పర్‌ఫ్యూమ్’ టైటిల్ ట్రాక్
ABN, First Publish Date - 2023-11-22T16:59:49+05:30
స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ‘పర్‌ఫ్యూమ్’. శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటిస్తున్నారు. జే.డి.స్వామి దర్శకుడు. తాజాగా ఈ మూవీ టైటిల్ ట్రాక్‌ని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరొలియో, బిగ్ బాస్ ఫేమ్ భోళే షావలి చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.
స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ‘పర్‌ఫ్యూమ్’ (Perfume). శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో చేనాగ్ (Che Nag), ప్రాచీ థాకర్ (Prachi Thaker) జంటగా నటిస్తున్నారు. జే.డి.స్వామి దర్శకత్వంలో తెరకెక్కగా.. జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 24న థియేటర్లలో విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే మాస్ బీట్ సాంగ్‌ని భీమ్స్ సిసిరొలియో, బిగ్ బాస్ ఫేమ్ భోళే షావలి చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.
‘ఏం చేసేటట్టు లేదు.. ఏం చూసేటట్టు లేదు’ అంటూ సాగిన ఈ మాస్ బీట్ ట్రాక్‌ని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరొలియో (Bheems Ceciroleo) కంపోజ్ చేశారు. హీరో చేనాగ్‌తో ఉన్న స్నేహాం కోసం భీమ్స్ ఈ పాటను కంపోజ్ చేసినట్లుగా మేకర్స్ వెల్లడించారు. సురేష్ గంగుల ఈ పాటకు సాహిత్యాన్ని రచించారు. వరం, కీర్తన శర్మ ఆలపించారు. ఈ పాట విన్న ప్రతి ఒక్కరినీ ఇట్టే ఆకర్షిస్తోంది. సినిమాలోని హీరో కారెక్టర్ మీద ఈ పాటను కంపోజ్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇంత వరకు వెండితెరపై రానటువంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై అందరిలోనూ అంచనాలు పెంచేశాయి. అసలీ స్మెల్ బేస్డ్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉండబోతుంది? అసలు దీని కథ ఏంటి? అనేది ఈ నవంబర్ 24న అందరికీ తెలియనుంది. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో.. కచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. (Perfume Movie Tittle Song Launched)
ఇవి కూడా చదవండి:
====================
*Payal Rajput: బోల్డ్ మూవీ అంటున్నారు కానీ.. సినిమా చూస్తేనే అందులో ఉందేంటో తెలుస్తుంది
*****************************
*Kaathal The Core: రెండు దేశాల్లో మమ్ముట్టి, జ్యోతికల చిత్రం బ్యాన్.. ఎందుకంటే?
*******************************