ఓ సామాన్యుడి సంతకం
ABN, First Publish Date - 2023-06-03T00:17:52+05:30
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి ‘పెద కాపు’ అనే పేరు ఖరారు చేశారు. ఓ సామాన్యుడి సంతకం అనేది ఉపశీర్షిక. శుక్రవారం విరాట్ ఫస్ట్ లుక్‌ని సైతం విడుదల చేశారు. గోదావరి జిల్లాలోని ఓ ప్రాంతంలో రాజకీయ నేపథ్యంలో సాగే పిరియాడిక్ డామ్రా ఇది. రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే.మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఛాయాగ్రహణం: చోటా. కె.నాయుడు, సమర్పణ: మిర్యాల సత్యనారాయణ రెడ్డి.