సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

HANU-MAN: పాన్ వరల్డ్ సినిమా షూటింగ్ పూర్తి

ABN, First Publish Date - 2023-04-17T19:17:41+05:30

ఇప్పుడు పాన్ వరల్డ్ (Pan World) రేంజ్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం టాలీవుడ్‌లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆ సినిమా వివరాల్లోకి వెళితే..

Hanu Man Still
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రీసెంట్‌గా నాని నటించిన ‘దసరా’ (Dasara) సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలైన మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ (Virupaksha) చిత్రం పాన్ ఇండియా వైడ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. అలాగే అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ (Agent) సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా విడుదలకాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాన్ వరల్డ్ (Pan World) రేంజ్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం టాలీవుడ్‌లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆ సినిమా వివరాల్లోకి వెళితే.. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్నతొలి చిత్రం ‘హను-మాన్‌’ (Hanu-Man). ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) కథానాయకుడిగా నటించిన ఈ చిత్ర షూటింగ్ పూర్తయిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా షూటింగ్ చివరి రోజు అద్భుతమైన లొకేషన్‌ని చూపించే వీడియోని మేకర్స్ షేర్ చేశారు.

ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి 130 వర్కింగ్ డేస్ పట్టింది. హను-మాన్ భారతదేశం అంతటా చిత్రీకరించబడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ తన చిత్రాలన్నింటి కంటే బెస్ట్ క్యాలిటీతో పాటు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం కోసం ఈ సినిమాపై ఎక్కువ సమయం కేటాయించారు. ఈ సినిమా టీజర్‌కు యూట్యూబ్‌లో అన్ని భాషల్లో అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. హనుమాన్ జయంతి నాడు విడుదలైన హనుమాన్ చాలీసా కూడా ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. (Hanu-Man Shooting Wrapped)

హను-మాన్ ‘అంజనాద్రి’ (Anjanadri) అనే ఊహాత్మక ప్రదేశంలో సెటప్ చేయబడింది. కథానాయకుడు హనుమంతుని శక్తులను పొంది అంజనాద్రి కోసం ఎలా పోరాడాడనేది చిత్ర కథాంశంగా తెలుస్తోంది. సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి టీమ్ అహర్నిశలు కష్టపడుతోంది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్ సినిమాగా ఈ చిత్రం విడుదల కానుంది. నిర్మాతలు త్వరలోనే ఖచ్చితమైన విడుదల తేదీని ప్రకటించనున్నారు. తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ (Amritha Aiyer) కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ (PrimeShow Entertainment)పై కె నిరంజన్ రెడ్డి (K Niranjan Reddy) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (Hanu-Man Movie Update)

ఇవి కూడా చదవండి:

*********************************

*Trisha: కార్తీతో కెమిస్ట్రీపై.. త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

*Kanchu Kagada: ఎన్టీఆర్‌ అభిమానుల ఆందోళన.. వెనక్కి తగ్గని కృష్ణ!

*Box Office: బావలు కలిస్తే.. బాక్సాఫీస్ బద్దలే!

*Vetrimaaran: ‘విడుదల’కు పాజిటివ్ టాక్.. ఛాన్స్ ఇచ్చే టాలీవుడ్ హీరో ఎవరు?

*Tammreddy Bharadwaja: మీ ఫ్యామిలీస్‌‌ని తిట్టినప్పుడు.. ఏమైంది మీ మగతనం? ఇండస్ట్రీ హీరోలకి సూటి ప్రశ్న?

Updated Date - 2023-04-17T19:17:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!