కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Okkasari Preminchaka: మినిమం గ్యారంటీ మూవీ.. ఒక్కసారైనా చూడాలి

ABN, First Publish Date - 2023-11-03T07:18:48+05:30

ఎస్.ఎల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శ్రీకాంత్ ఆరోల్ల దర్శకత్వంలో భాస్కర్ యాదవ్(బన్నీ) - లక్ష్మీ హీరోహీరోయిన్లుగా చంగల కుమార్ యాదవ్ నిర్మాతగా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సినిమా ‘ఒక్కసారి ప్రేమించాక’. ఈ చిత్ర టికెట్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్, ఎన్.బి.టి.నగర్‌లో రీసెంట్‌గా ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని... మన హైదరాబాద్ కుర్రాడు, ముఖ్యంగా మన ఎన్.బి.టి.నగర్ కుర్రాడు బన్నీ యాదవ్ హీరోగా పరిచయం అవుతున్న ‘ఒక్కసారి ప్రేమించాక’ చిత్రాన్ని మన హైదరాబాద్ వాసులు, మరీ ముఖ్యంగా ఎన్.బి.టి.నగర్ వాసులు ప్రతి ఒక్కరూ ఒక్కసారయినా చూసి, బన్నీని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రం ఎమ్.జి.ఎమ్ (మినిమం గ్యారంటీ) మూవీస్ ద్వారా నవంబర్ 3న ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదలవుతోంది.

Updated Date - 2023-11-03T07:18:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!