సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

O Saathiya: ఈ సినిమా చూసిన వారంతా.. వారి ‘తొలిప్రేమ’ను గుర్తు చేసుకుంటారట..

ABN, First Publish Date - 2023-07-06T20:13:05+05:30

ఆర్యన్‌ గౌరా, మిస్టీ చక్రవర్తి హీరోహీరోయిన్లుగా.. తన్వికా–జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై దివ్య భావన‌ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మించిన చిత్రం ‘ఓ సాథియా’ . ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 7న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమా చూసిన వారంతా వారి తొలిప్రేమ నాటి రోజులకు వెళతారని నిర్మాతలు చెబుతున్నారు.

O Saathiya Movie Still
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్యన్‌ గౌరా (Aryan Gowra), మిస్టీ చక్రవర్తి (Mishti Chakravarty) హీరోహీరోయిన్లుగా.. తన్వికా–జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై దివ్య భావన‌ (Divya Bhavana)ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ చందన కట్టా (Chandana Katta), సుభాష్‌ కట్టా (Subhash Katta) నిర్మించిన చిత్రం ‘ఓ సాథియా’ (O Saathiya Movie). ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 7న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమా చూసిన వారంతా.. కచ్చితంగా వారి తొలిప్రేమను గుర్తు చేసుకుంటారని మేకర్స్ అంటున్నారు. ప్రేమ కథల్లో‌ని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ నూతన దర్శకురాలు దివ్య భావన ఈ సినిమాని తెరకెక్కించారని, తొలిప్రేమ అనుభవం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కనెక్ట్ అయ్యే విధంగా ఆసక్తికర సన్నివేశాలతో ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఈ సమాజంలోని ప్రతి ఒక్క వ్యక్తికి తొలిప్రేమ అనుభవం అనేది ఉండే ఉంటుంది. ఆ రోజుల్లోని మధుర జ్ఞాపకాలు హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అప్పట్లో చేసిన అల్లరి, చిలిపి పనులు.. ఎమోషనల్ మూమెంట్స్ ఎప్పటికీ మదిలో మెదులుతూనే ఉంటాయి. ప్రేమ గుర్తులు అనేవి మరపురాని మధుర స్మృతులు. సరిగ్గా అదే పాయింట్ తీసుకొని ఈ సినిమాను రూపొందించారు డైరెక్టర్ దివ్య భావన. ప్రేమకథల్లో ఇది ఎంతో వైవిధ్యం చూపించే స్టోరీ కావడంతో.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించాం. (O Saathiya Movie Ready to Release)

సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు కూడా మంచి సినిమా తీశారంటూ అభినందించడం, క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు.. పలు సూపర్ హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన UFO మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తుండటం‌తో.. చిత్ర సక్సెస్ పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నాం. కుటుంబ సమేతంగా హాయిగా రిలాక్స్ అవుతూ ఆ నాటి తొలిప్రేమ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లడానికి ఓ సాథియా సినిమా జూలై 7న థియేటర్స్ వస్తుంది. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాము’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Thangalaan: విక్రమ్ ‘తంగలాన్‌’ ఎంత వరకు వచ్చిందంటే..

**************************************

*Lavanya Tripathi: పెళ్లి కళ వచ్చేసింది.. ఎంగేజ్‌మెంట్ తర్వాత ఎంత మార్పు వచ్చిందో చూశారా!

**************************************

*Nikhil: ఇక ఆ తప్పు జరగనివ్వను.. సారీ చెప్పిన హీరో నిఖిల్

**************************************

*Pawan Kalyan: మళ్లీ విడాకులు అంటున్న వారికి చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం

**************************************

*NKR21: మరో యంగ్ దర్శకుడితో.. యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో.. కళ్యాణ్ రామ్ స్పీడ్ చూశారా!

**************************************

Updated Date - 2023-07-06T20:13:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!