Spy Trailer Talk: స్వాతంత్య్రం అంటే ఒకడు ఇచ్చేది కాదు, లాక్కునేది. ఇదెవరు చెప్పారో తెలుసా?
ABN, First Publish Date - 2023-06-22T22:10:06+05:30
‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్ మరోసారి చేస్తున్న పాన్ ఇండియా ప్రయత్నమే ‘స్పై’. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకుంటూ.. టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
‘కార్తికేయ 2’ (Karthikeya 2) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) మరోసారి చేస్తున్న పాన్ ఇండియా ప్రయత్నమే ‘స్పై’ (Spy). నిఖిల్ సరసన ఐశ్వర్యమీనన్ (Iswarya Menon) జంటగా నటించిన ఈ పాన్ ఇండియా సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subhash Chandrabose) మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా వస్తుండడంతో దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇప్పుటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా మంచి స్పందనను రాబట్టుకుంటోంది.
ట్రైలర్ విషయానికి వస్తే.. (Nikhil Spy Trailer Talk) చరిత్ర ఎప్పుడూ మనకు నిజం చెప్పదు.. దాస్తుంది. దానికి సమాధానం మనమే వెతకాలి.. అనే వాయిస్‌తో మొదలైన ఈ ట్రైలర్.. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. సాంకేతికంగా, యుద్ధ సన్నివేశాల పరంగా సినిమా గ్రాండియర్‌గా ఉండబోతుందనేది ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ట్రైలర్ మధ్యలో ‘అన్నీ చేయిదాటి పోతున్నప్పుడేగా.. మనం వేరే దార్లు వెతుక్కుంటాం..’ అని నిఖిల్ చెప్పిన డైలాగ్, చివరిలో ‘స్వాతంత్ర్యం అంటే ఒకడు ఇచ్చేది కాదు, లాక్కునేది. ఇదెవరు చెప్పారో తెలుసా?’ అంటూ దగ్గుబాటి రానా చెప్పే డైలాగ్, ఆయన కనిపించిన తీరు.. సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. అలాగే విజువల్స్ కూడా చాలా గ్రాండియర్‌గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, నటీనటులు కనిపించిన తీరు.. సినిమా ఓ రేంజ్‌లో ఉండబోతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. నేతాజీ గురించి రహస్యం చెప్పబోతున్నామంటూ మొదటి నుంచి ప్రచారం చేస్తూ వస్తున్న టీమ్.. ఇందులో ఆర్యన్ రాజేష్‌ని బోస్‌గా, నిఖిల్‌కి బ్రదర్‌లా చూపించడమే.. కాస్తంత కన్ఫ్యూజ్ చేస్తుంది. ఆ కన్ఫ్యూజ్ వీడాలంటే మాత్రం జూన్ 29 వరకు వెయిట్ చేయక తప్పదు.
ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కె రాజశేఖర్ రెడ్డి (K Rajashekhar Reddy), సిఇఒగా చరణ్‌తేజ్ ఉప్పలపాటితో కలిసి భారీ స్థాయిలో నిర్మించారు. నిర్మాత కె రాజశేఖర్ రెడ్డే కథను కూడా అందించారు. ఈ చిత్రం జూన్ 29న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. దర్శకుడు గ్యారీ బిహెచ్ (Garry BH) ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Rashmika Mandanna: మేనేజర్‌తో విభేదాలనే వార్తలపై రష్మిక ఏమందంటే..
**************************************
*MAA: టాలీవుడ్, బాలీవుడ్ సరిహద్దులను చెరిపేస్తున్న ‘మా’
**************************************
*Agent: రైట్స్ విషయంలో దేవుడు కాపాడాడు .. ఏషియన్ సునీల్ సంచలన వ్యాఖ్యలు
**************************************
*Pawan Kalyan: జగన్ రెడ్డి వల్ల నాకు ఎన్ని కోట్లు లాసో తెలుసా? ఆ లాస్ నేనే భరించా?
**************************************
*Varun Sandesh: సినిమా షూటింగ్‌లో హీరో వరుణ్ సందేశ్‌కు గాయాలు
**************************************