Spy: మరో పాన్ ఇండియా సంచలనానికి సిద్ధమైన నిఖిల్.. ఎప్పుడంటే?
ABN, First Publish Date - 2023-06-17T19:56:44+05:30
‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా వైడ్‌గా సక్సెస్ కొట్టిన హీరో నిఖిల్ సిద్ధార్థ్.. మరోసారి అటువంటి సంచలనానికే సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటించిన మరో పాన్ ఇండియా సినిమా ‘స్పై’. ఈ సినిమా విడుదల తేదీని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు.
‘కార్తికేయ 2’ (Karthikeya 2) సినిమాతో పాన్ ఇండియా వైడ్‌గా సక్సెస్ కొట్టిన హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth).. మరోసారి అటువంటి సంచలనానికే సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటించిన మరో పాన్ ఇండియా సినిమా ‘స్పై’ (Spy). ఈ సినిమా విడుదల తేదీని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ‘స్పై’ సినిమా జూన్ 29న భారీ స్థాయిలో విడుదలకాబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు నిర్మాత కె. రాజశేఖర్ రెడ్డే కథని కూడా అందించడం విశేషం. (Spy Release Date)
ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా ఇది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి, లక్షలాది మంది సామాన్యులను సైనికులుగా తయారు చేసి.. వారిలో యుద్ధ స్ఫూర్తిని నింపిన సుభాష్ చంద్రబోస్ (Subhas Chandra Bose).. యుద్ధ సమయంలో 1945లో ప్లేన్ క్రాష్‌కు గురయ్యారు. ఆ ఘటనతో భారతీయ చరిత్ర సుభాష్ చంద్రబోస్ ఆచూకీని కోల్పోయింది. ఇప్పటికీ ఆయన మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. అలాంటి పవర్‌ఫుల్ స్టోరీలో దాగి ఉన్న అనేక రహస్యాలను ఎంతో రీసెర్చ్ చేసి ‘స్పై’గా తీసుకొస్తున్నారు నిర్మాత కె. రాజశేఖర్ రెడ్డి (K Rajashekhar Reddy). ఈ కథను అంతే ఉత్కంఠభరితంగా దర్శకుడు గ్యారీ బీహెచ్ (Garry BH) తెరకెక్కించినట్లుగా ఇటీవల వచ్చిన టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది.
ఈ మూవీ భారతదేశ చరిత్రలో నిలిచిపోతుందని మేకర్స్ చెబుతున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో జూన్ 29న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా వారు తెలిపారు. ఈ సినిమాకు ప్రాణం అయిన నేపథ్య సంగీతాన్ని శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ ఇద్దరూ కలిసి అందించారు. ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్ ఓ కీలక పాత్ర చేస్తుండగా.. సన్యా ఠాకూర్, అభినవ్ గోమటం, మకరంద్ దేశ్‌పాండే, జిషు సేన్ గుప్తా తదితరులు ఇతర పాత్రలలో నటించారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Adipurush: ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ‘ఆదిపురుష్’ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
**************************************
*Prabhas Fans: సినిమా బాలేదన్నందుకు ఒకర్ని.. హనుమ కుర్చీలో కూర్చున్నందుకు మరొకర్ని.. చితకబాదారు
**************************************
*Lord Hanuma: ‘ఆదిపురుష్’ థియేటర్‌లోకి వానరం.. హనుమంతుడే అంటూ ఆడియన్స్ జైశ్రీరామ్ నినాదాలు.. వీడియో వైరల్
**************************************
*Adipurush: ‘ఆదిపురుష్’ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..
**************************************