సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Spy Teaser: ‘కార్తికేయ 2’ని మించి.. నిఖిల్ మరో సాహసం చేస్తున్నాడు

ABN, First Publish Date - 2023-05-15T18:42:36+05:30

స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ (Subhash Chandrabose) యొక్క రహస్యాల ఆధారంగా తెరకెక్కుతోన్న ‘స్పై’ టీజర్ ఎలా ఉందంటే..

Nikhil Siddhartha in Spy Movie
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిఖిల్ (Nikhil) పాన్-ఇండియన్ మూవీ, నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’. ఈ సినిమా స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ (Subhash Chandrabose) యొక్క రహస్యాల ఆధారంగా రూపొందించబడిందని మేకర్స్ ఇటీవల విడుదల చేసిన వీడియోతో క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ విడుదలకు ఉన్న విశిష్టత ఏమిటంటే.. ఢిల్లీలో ఐకానిక్ ల్యాండ్‌ మార్క్‌ అయిన కర్తవ్య పథ్(రాజ్ పాత్) Kartavya Path(Raj Path) వద్ద ఈ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఐకానిక్ ల్యాండ్‌ మార్క్‌‌లో లాంచ్ అయిన మొదటి సినిమా టీజర్ ఇదే కావడం విశేషం. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. నిఖిల్‌కు మరో భారీ విజయం రాబోతుందనే సిగ్నల్స్‌ని ఇస్తోంది.

టీజర్ విషయానికి వస్తే.. భగవాన్ జీ ఫైల్స్ గురించి మకరంద్ దేశ్‌ పాండే (Makrand Deshpande) తన టీమ్‌కి వివరించడంతో టీజర్ ప్రారంభమైంది. ఇది ఇండియన్ సీక్రెట్, ఆజాద్ హింద్ ఫౌజ్ సృష్టికర్త, విజనరీ సుభాష్ చంద్రబోస్ గురించి. నేతాజీ విమాన ప్రమాదంలో మరణించడాన్ని ఆయన ఒక కవర్-అప్ కథగా అభివర్ణించారు. స్పై పాత్ర పోషిస్తున్న నిఖిల్‌కి మిస్టరీని ఛేదించే బాధ్యతను అప్పగించారు. తర్వాత తెరపై లావిష్ యాక్షన్ కనిపించింది. తెలియని వాస్తవాలను తెలుసుకోవడం ఎల్లప్పుడూ గొప్ప విషయం. స్పై ఇండియన్ బెస్ట్ సీక్రెట్‌ని చూపించబోతోంది. ‘కార్తికేయ 2’ (Karthikeya 2) తరహాలోనే ఈ సినిమా తెరకెక్కినట్లుగా ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. దాదాపు స్క్రీన్‌ప్లే కూడా ఆ సినిమా తరహాలోనే నడిచినట్లుగా అనిపిస్తోంది. విజువల్స్, కెమెరా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్ని హైలెట్ అనేలా ఉన్నాయి. గ్యారీ బిహెచ్ (Garry BH) తొలి చిత్రంతోనే దర్శకుడిగా తన మార్క్ ప్రదర్శించబోతున్నారనేది.. అడుగడుగునా కనిపిస్తోంది.

టీజర్ విడుదల సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ (Nikhil Speech at Spy Teaser Launch).. టీజర్ లాంచ్ చేయడానికి ఢిల్లీకి వచ్చాం. కర్తవ్య మార్గ్ పవిత్రమైన, త్యాగానికి చిహ్నం. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌‌కి సంబంధించి ఇప్పటి వరకూ ఎవరూ వినని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అందుకే మొదటి టీజర్‌‌ని నేతాజీ విగ్రహం వద్ద విడుదల చేయాలనుకున్నాం. ఆయన సమక్షంలో ఇక్కడ టీజర్‌‌ను విడుదల చేసే అవకాశం మాకు లభించినందుకు గౌరవంగా, చాలా సంతోషంగా ఉన్నాము. ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతోంది. ఇది మరొక ప్రయత్నం. మేము కొత్త పాయింట్‌‌తో ముందుకు వచ్చాం. కోర్ పాయింట్ తెలిస్తే షాక్ అవుతారు. మన సైనికుల త్యాగంతో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. నేతాజీ జీవితంపై సినిమా తీస్తున్నాం. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ చిత్రం. భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి నేతాజీ, ఆజాద్ హింద్ ఫౌజ్‌ ప్రధాన కారణమని అన్నారు. కాగా.. ఈ చిత్రాన్ని జూన్ 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*AadiKeshava Glimpse: పంజా వైష్ణవ్ తేజ్ ఉగ్రరూపం

*Pic Talk: రారా కృష్ణయ్యా.. రారా కృష్ణయ్యా..

*Ram Charan: ముంబైలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏం చేశారంటే..

*Krithi Shetty: కాబోయేవాడు కాస్త బొద్దుగా ఉండాలి..

*Ustaad Bhagat Singh: బాబాయ్ మూవీ గ్లింప్స్‌పై అబ్బాయ్ రియాక్షన్ ఇదే..

*Bandla Ganesh: బానిసత్వానికి భాయ్ భాయ్.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తా..

*Ileana: బంప్ అలెర్ట్.. అంటూ ఇలియానా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

Updated Date - 2023-05-15T18:42:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!