Niharika Konidela: ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలోకి.. నిహారిక మరో స్టెప్
ABN, First Publish Date - 2023-11-10T19:52:52+05:30
ఇప్పటి వరకు మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కే పరిమితమైంది. ఇప్పుడామె మరో స్టెప్ తీసుకుని.. ఫీచర్ ఫిల్మ్‌తో వెండితెరకు నిర్మాతగా పరిచయం కాబోతోంది. శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్‌తో కలిసి తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి.పై ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్‌ని నిహారిక నిర్మించబోతోంది. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగాయి.
ఇప్పటి వరకు మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) నిర్మాతగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కే పరిమితమైంది. ఇప్పుడామె మరో స్టెప్ తీసుకుని.. ఫీచర్ ఫిల్మ్‌తో వెండితెరకు నిర్మాతగా పరిచయం కాబోతోంది. నిహారిక కొణిదెల సమర్పణలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా తదితరులు నటీనటులుగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి (Pink Elephant Pictures LLP), శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ (Sri Radha Damodar Studios) బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న చిత్ర పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగాయి.
ముహూర్తపు సన్నివేశానికి హీరో వరుణ్ తేజ్ (Varun Tej) క్లాప్ కొట్టారు. నాగబాబు (Nagababu) కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula) గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) స్క్రిప్ట్‌ని నిహారిక కొణిదెల, డైరెక్టర్ యదు వంశీ సహా చిత్ర యూనిట్ సభ్యులకు అందించారు.
ఈ సందర్భంగా నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఇప్పటి వరకు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ మాత్రమే చేస్తూ వచ్చాం. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ స్టార్ట్ చేశాం. మాతో పాటు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ వారు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సేమ్ టైమ్ టెన్షన్‌గానూ ఉంది. యదు వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మంచి టీమ్, కాన్సెప్ట్‌తో రాబోతున్న సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం. ఇంత మంది కొత్త వాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాం. అయితే మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతోనే ఈ స్టెప్ వేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు. (Producer Niharika Feature Film Launch)
చిత్ర దర్శకుడు యదు వంశీ (Yadhu Vamsi) మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పింక్ ఎలిఫెంట్ కాన్సెప్ట్ బేస్డ్ కంటెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తోంది. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నారు. కొత్తవాళ్లతో ఈ బ్యానర్ సినిమా చేయటం ఆనందంగా ఉంది. ఇందులో 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని నమ్ముతున్నాం. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తాం. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్, సినిమాటోగ్రాఫర్ రాజు ఎడురోలు, ఎడిటర్ అన్వర్ అలీ మాట్లాడారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాతో నిర్మాతలుగా పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ నిర్మాతలు ఫణి (Phani), జయలక్ష్మి (Jayalakshmi).
ఇవి కూడా చదవండి:
========================
*Suman: అలా చేస్తే.. అన్ని భాషల సినిమా వాళ్లు ఆంధ్రా వైపు చూస్తారు
***************************************
*Trisha: మెగాస్టార్ చిరంజీవి బాటలో ‘త్రిష’ చిత్రం..
************************************
*Kannappa: ‘కన్నప్ప’కు అదే కరెక్ట్ అంటోన్న మంచు విష్ణు
*************************************
*NBK109: బాలయ్య మరో మాస్ రాంపేజ్ అప్‌డేట్.. పిక్ అదిరింది
*************************************