కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నరకాసుర గర్వపడే సినిమా

ABN, First Publish Date - 2023-10-11T04:52:00+05:30

‘పలాస’ ఫేమ్‌ రక్షిత్‌ అట్లూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘నరకాసుర’. అపర్ణా జనార్థన్‌, సంకీర్తనా విపిన్‌ హీరోయిన్లు. డాక్టర్‌ శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు....

‘పలాస’ ఫేమ్‌ రక్షిత్‌ అట్లూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘నరకాసుర’. అపర్ణా జనార్థన్‌, సంకీర్తనా విపిన్‌ హీరోయిన్లు. డాక్టర్‌ శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. సెబాస్టియన్‌ నోవా అకోస్టా జూనియర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్‌ 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించింది. రక్షిత్‌ అట్లూరి మాట్లాడుతూ ‘రెండేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. ‘నరకాసుర’ మేమందరం గర్వపడే సినిమా అవుతుంది. కాఫీ ఎస్టేట్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. త్వరలో ఏపీ టూర్‌ ప్లాన్‌ చేస్తున్నాం’ అన్నారు. ‘నరకాసుర’ ప్రేక్షకులను సర్ర్పైజ్‌ చేస్తుంది, ఈ సినిమాతో దీపావళి వారం ముందుగానే థియేటర్లలోకి వస్తుందని దర్శకుడు చెప్పారు. రక్షిత్‌ నటన సినిమాకు హైలెట్‌ అవుతుందని నిర్మాత తెలిపారు.

Updated Date - 2023-10-11T04:52:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!