కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Devil: ‘డెవిల్’ కోసం కళ్యాణ్ రామ్ ఎన్ని కాస్ట్యూమ్స్‌ మార్చారో తెలుసా?

ABN, First Publish Date - 2023-12-11T13:45:27+05:30

నందమూరి కళ్యాణ్ రామ్.. డిఫరెంట్ మూవీస్‌కి పెట్టింది పేరు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా.. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌కనిర్మాత‌గా ‘డెవిల్’ అనే సినిమా తెరకెక్కుతోంది. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమాను భారీ ఎత్తున విడుద‌ల‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదొక పీరియడ్‌ డ్రామా. ఇందులో కళ్యాణ్ రామ్ 90 కాస్ట్యూమ్స్‌ను ఉప‌యోగించినట్లుగా కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ చెప్పుకొచ్చారు.

Kalyan Ram in Devil

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram).. డిఫరెంట్ మూవీస్‌కి పెట్టింది పేరు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా.. అభిషేక్ పిక్చ‌ర్స్ (Abhishek Pictures) బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా (AbhiShek Nama) ద‌ర్శ‌కనిర్మాత‌గా ‘డెవిల్’ (Devil) అనే సినిమా తెరకెక్కుతోంది. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమాను భారీ ఎత్తున విడుద‌ల‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదొక పీరియడ్‌ డ్రామా. బ్రిటీష్‌వారు ఇండియాను ప‌రిపాలించిన కాలానికి సంబంధించిన క‌థ‌తో తెర‌కెక్కిన సినిమా కావ‌టంతో నాటి ప‌రిస్థితుల‌ను ఆవిష్క‌రించేలా భారీగా సినిమాను చిత్రీక‌రించారు. అలాగే న‌టీన‌టులకు సంబంధించిన వ‌స్త్రాలంక‌ర‌ణ భార‌తీయ‌త‌ను ప్ర‌తిబింబించేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో క‌ళ్యాణ్ రామ్‌ను గ‌మ‌నిస్తే.. ఆయ‌న గూఢ‌చారిగా క‌నిపించ‌బోతున్నారు. ఇలాంటి పాత్ర‌ను ఆయ‌న చేయ‌టం ఇదే మొద‌టిసారి కావ‌టంతో ద‌ర్శ‌క నిర్మాత అభిషేక్ నామా, కాస్ట్యూమ్ డిజైన‌ర్ రాజేష్ (Costume Designer Rajesh).. క‌ళ్యాణ్ రామ్ లుక్‌ను సినిమా ఆసాంతం స‌రికొత్త‌గా ఉండేలా డిజైన్ చేశారు.

దీని గురించి కాస్ట్యూమ్ డిజైన‌ర్ రాజేష్ మాట్లాడుతూ.. ‘‘దర్శకనిర్మాత అభిషేక్ నామాగారు డెవిల్ స్క్రిప్ట్ నాకు వివరించ‌గానే హీరోగారి లుక్ డిఫరెంట్‌గా ఉండాల‌ని అర్థ‌మైంది. ఇందులో హీరో భారతీయుడు, అయిన‌ప్ప‌టికీ బ్రిటీష్ గూఢ‌చారిగా ప‌ని చేస్తుంటారు. ఆయ‌న పాత్రను ఎలివేట్ చేసేలా కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేయాల‌నుకున్నాను. డెవిల్‌లో క‌ళ్యాణ్ రామ్‌ను గ‌మ‌నిస్తే ఆయ‌న ధోతి కట్టుకుని ఉంటారు. పైన ఒక వెయిస్ట్‌ కోటుని ధ‌రించి ఉంటారు. ఆయ‌న కాస్ట్యూమ్స్‌లో భార‌తీయ‌త క‌నిపించేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. ఈ సినిమా చూసిన అందరికీ ఆయన సరికొత్తగా కనిపించనున్నారు. బ్రిటీష్ నేపథ్యంలో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలలోని కాస్ట్యూమ్స్‌కు, ఇందులోని కాస్ట్యూమ్స్‌కి చాలా తేడా ఉంటుంది’’ అని అన్నారు.


‘డెవిల్’ కాస్ట్యూమ్స్ హైలైట్స్‌... (Devil Costumes highlights)

* డెవిల్ సినిమా కోసం క‌ళ్యాణ్ రామ్ 90 కాస్ట్యూమ్స్‌ను ఉప‌యోగించారు.

* ఇట‌లీ నుంచి తెప్పించిన‌ మోహైర్ ఊల్‌తో 60 బ్లేజ‌ర్స్‌ను ప్ర‌త్యేకంగా తయారు చేశారు

* వెయిస్ట్ కోటుతో పాటు దేశీయ‌ కాట‌న్‌తో కుర్తా, ధోతిని తయారు చేశారు

* ప్ర‌తీ కాస్ట్యూమ్ (బ్లేజ‌ర్‌, కుర్తా, ధోతి)కి 11.5 మీట‌ర్స్ ఫ్యాబ్రిక్‌ను ఉప‌యోగించారు

* హీరోని స్టైల్‌గా చూపించే క్ర‌మంలో 25 ప్ర‌త్యేక‌మైన‌ వెయిస్ట్ కోట్స్‌ను ఉప‌యోగించారు

* హీరో వేసుకునే బ్లేజ‌ర్ జేబు ప‌క్క‌న వేలాడుతూ ఉండేలా ఓ హ్యాంగింగ్ వాచ్‌ను ప్ర‌త్యేకంగా త‌యారు చేశారు

* పురాత‌న వాచీల‌ను సేక‌రించే వ్య‌క్తి ఢిల్లీలో ఉంటే అత‌ని ద‌గ్గ‌ర నుంచి ఈ హ్యాంగింగ్ వాచ్‌ను తీసుకురావ‌టం విశేషం

* కాస్ట్యూమ్ డిజైన‌ర్ రాజేష్‌కి డెవిల్ 60వ చిత్రం.. క‌ళ్యాణ్ రామ్‌తో ఇది 6వ సినిమా. ఎం.ఎల్‌.ఎ, 118, ఎంత మంచివాడ‌వురా వంటి క‌ళ్యాణ్ రామ్ సినిమాల‌కు రాజేష్ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ఆయ‌న చేయ‌బోతున్న నెక్ట్స్ 3 సినిమాల్లోనూ రాజేష్ వ‌ర్క్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Naa Saami Ranga: చందమామకే పిల్లలు పుడితే.. నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే!

************************************

*Manushi Chhillar: నా గాళ్స్‌ గ్యాంగ్‌ని వెంటేసుకొని.. చుట్టొస్తా!

*******************************

*Neha Shetty: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం

***********************************

Updated Date - 2023-12-11T13:45:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!