కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nandamuri Chaitanya Krishna: నాన్న‌గారు ఏం చెప్పారంటే..?

ABN, First Publish Date - 2023-11-26T18:01:28+05:30

మా తాతగారు నందమూరి తారక రామారావు‌గారు, మా నాన్నమ్మ బసవతారకంగారు నాకు స్ఫూర్తి. వారి ఒడిలో పెరిగాను. వారి ఆశీస్సులతో ‘బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ పెట్టి పరిశ్రమలోకి అడుగుపెడుతున్నానని అన్నారు నందమూరి చైతన్య కృష్ణ. ఆయన హీరోగా నటించిన ‘బ్రీత్’ చిత్రం డిసెంబర్ 2న విడుదల కాబోతోన్న సందర్భంగా.. చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు.

Breathe Pre Release Event

‘బసవతారకరామ క్రియేషన్స్’ (Basavatarakaram Creations) బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 1గా నందమూరి జయకృష్ణ (Nandamuri Jayakrishna) తన కుమారుడు చైతన్య కృష్ణ (Nandamuri Chaitanya Krishna)ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన సీట్ ఎడ్జ్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘బ్రీత్’ (Breathe). ‘వైద్యో నారాయణో హరి’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ళ (Vamsi Krishna Akella) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘బ్రీత్’ ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై క్యురియాసిటీని పెంచింది. డిసెంబర్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో చిత్రయూనిట్ శనివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ వేడుకను (Pre Release Event) నిర్వహించింది. నందమూరి కుటుంబ సభ్యులు పలువురు ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో నందమూరి చైతన్య కృష్ణ మాట్లాడుతూ.. మా తాతగారు నందమూరి తారక రామారావు‌గారు (NT Ramarao), మా నాన్నమ్మ బసవతారకంగారు నాకు స్ఫూర్తి. వారి ఒడిలో పెరిగాను. వారి ఆశీస్సులతో ‘బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ పెట్టి పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాను. నాన్నగారు మంచి కథతో సినిమా చేయమని చెప్పారు. మంచి కథల కోసం చూస్తున్న సమయంలో దర్శకుడు వంశీకృష్ణ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. మంచి సందేశంతో సమాజానికి అవసరమైన కథ ఇది. వంశీ అద్భుతమైన కాన్సెప్ట్‌తో అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకొని ఈ సినిమాని తీర్చిదిద్దారు. భవిష్యత్‌లో మేము మళ్ళీ కలిసి పని చేస్తాం. మా బాబాయ్ బాలకృష్ణ‌గారు, బి గోపాల్‌గారు, కోడిరామకృష్ణ గార్ల కాంబినేషన్ ఎలా అయితే హిట్ కాంబినేషన్‌గా నిలిచిందో.. మాది కూడా తప్పకుండా హిట్ కాంబినేషన్ అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాన్నగారికి ధన్యవాదాలు. (Breathe Pre Release Event)


తాతగారు తనకంటూ సొంత మార్క్‌ని క్రియేట్ చేసుకొని కోట్లాదిమందికి ఆరాధ్య దైవమయ్యారు. నేను పరిశ్రమలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నాన్న గారు.. ‘నీకంటూ ఒక సొంత మార్క్‌ని క్రియేట్ చేసుకో, ఎవరినీ అనుకరించవద్దు’ అని సూచించారు. ఆ సూచనకు కట్టుబడివుంటాను. ఈ బ్యానర్ నుంచి అభిమానులకు నచ్చే మంచి మంచి సినిమాలు వస్తాయని తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో దాదాపు చాలా మంది కొత్త నటీనటులు పని చేశారు. అందరూ అద్భుతంగా నటించారు. హీరోయిన్ వైదిక చాలా చక్కగా నటించింది. కెమెరామెన్ రాకేశ్ అద్భుతమైన విజువల్స్ అందించారు. ఇందులో డిఫరెంట్ కలర్ గ్రేడింగ్ వుంటుంది. మార్క్ రాబిన్ ఈ సినిమాకి అద్భుతమైన బీజీఎం ఇచ్చారు. ఈ సినిమా తర్వాత ఆయనకి చాలా మంచి పేరు వస్తుంది. తప్పకుండా ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Sandeep Reddy Vanga: పక్కా తెలంగాణ బిడ్డని.. ఆ రోజులు తలుచుకుంటే భయమేస్తుంది

******************************

*Geethanjali Sequel: ‘గీతాంజలి’తో అంజలి మళ్లీ వస్తోంది

******************************

*Sandeep Reddy Vanga: మహేష్ బాబుకి ఒక కథ చెప్పా.. కానీ?

******************************

*Srikanth: ఈ మ‌ధ్య‌కాలంలో నాకు ఏ చిత్రానికి ఇన్ని ప్ర‌శంస‌లు రాలేదు

*******************************

Updated Date - 2023-11-26T18:05:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!