కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sound Party: ‘సౌండ్ పార్టీ’కి ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సపోర్ట్

ABN, First Publish Date - 2023-08-04T16:45:34+05:30

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడక్షన్ నెం. 1‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘సౌండ్ పార్టీ’. వి.జె.స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు. తాజాగా ఈ చిత్ర పోస్టర్‌ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విడుదల చేసి.. యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

MLC Kavitha Kalvakuntla

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ (Full Moon Media Productions) ప‌తాకంపై ప్రొడక్షన్ నెం. 1‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘సౌండ్ పార్టీ’ (Sound Party). వి.జె.స‌న్నీ (VJ Sunny), హ్రితిక శ్రీనివాస్ (Hrithika Srinivas) హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు. షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్‌ను తాజాగా ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత (MLC Kalvakuntla Kavitha) ఆవిష్క‌రించారు. పోస్టర్ విడుదల అనంతరం క‌ల్వ‌కుంట్ల క‌విత మాట్లాడుతూ.. ‘సౌండ్ పార్టీ’ టైటిల్, పోస్ట‌ర్ ఎంతో ఇంట్ర‌స్టింగ్‌గా ఉన్నాయి. కాన్సెప్ట్ కూడా ఎంతో ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉండ‌బోతున్న‌ట్లు టైటిల్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానని అన్నారు.


నిర్మాత ర‌వి పోలిశెట్టి (Ravi Polishetty) మాట్లాడుతూ.. మా సినిమా పోస్ట‌ర్‌ను నిజామాబాద్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌గారు లాంచ్ చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ప్ర‌త్యేకంగా మా ‘సౌండ్ పార్టీ’ యూనిట్ అంద‌రి త‌ర‌ఫున క‌విత గారికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాం. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టైటిల్‌కు వ‌చ్చిన స్పంద‌నే పోస్ట‌ర్‌కు కూడా వ‌స్తోంది. ఈ సినిమా షూటింగ్ విజ‌య‌వంతంగా పూర్త‌యి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. యూనిట్ అంతా ఎంతో శ్ర‌మించి అనుకున్న దానికన్నా అద్భుతంగా చిత్రాన్ని తెర‌కెక్కించారు. త్వ‌ర‌లో విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం. మాకు స‌హ‌క‌రిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు అని తెలిపారు. (Sound Party Poster Launch)

సినిమా చాలా బాగా వచ్చిందని హీరో వీజే సన్ని తెలిపారు. ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి మాట్లాడుతూ.. చిత్ర టైటిల్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. క‌విత గారి చేతుల మీదుగా మా చిత్ర పోస్ట‌ర్ లాంచ్ చేశాము. పోస్ట‌ర్ లాంచ్ చేసి ఆమె మా టీమ్ అంద‌రికీ బ్లెస్సింగ్స్ అందించ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయని అన్నారు. మా నిర్మాత‌లు ఇచ్చిన స‌పోర్ట్‌తో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాను గ్రాండ్‌గా పిక్చ‌రైజ్ చేశామని చిత్ర స‌మ‌ర్ప‌కుడు జ‌య‌శంక‌ర్ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Chiranjeevi: సిద్ధు, వరుణ్ తేజ్, కార్తికేయ.. ఎవరూ కాదు.. చిరు సినిమాలో ఆ హీరోకి ఛాన్స్!

**************************************

*Ananya Nagalla: బాబోయ్.. భయపెట్టేస్తోన్న అనన్య.. ఆ కోరిక తీరేనా?

**************************************

*NTR vs Allu Arjun: ‘పుష్పరాజ్’ వర్సెస్ ‘దేవర’.. ఫిక్సయినట్టేనా?

**************************************

*Deviyani Sharma: ఈ ‘సైతాన్’ భామ చూపు మారింది

**************************************

*Aditi Shankar: ఆ బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌లో శంకర్ తనయ..

**************************************

Updated Date - 2023-08-04T16:45:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!