Naresh: ట్రైలర్.. జస్ట్ మచ్చు తునక మాత్రమే!
ABN, First Publish Date - 2023-05-11T20:46:26+05:30
ఇప్పుడు ట్రైలర్, టీజర్ చూశారు. ఇది మచ్చు తునక మాత్రమే.. సినిమాలో చాలా విషయం ఉంది. ఈ కథకు టైటిల్ ఏమి పెట్టాలని అనుకున్నప్పుడు గతంలో కృష్ణగారు, విజయనిర్మలగారు నటించిన
నవరసరాయ డా. నరేష్ వికె (Dr Naresh VK), పవిత్ర లోకేష్ (Pavitra Lokesh) కాంబినేషన్‌లో.. మెగా మేకర్ ఎమ్‌ఎస్ రాజు (MS Raju) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘మళ్ళీ పెళ్లి’ (Malli Pelli). నరేష్‌కి ఇది గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్. ఈ చిత్రం మే 26న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. విలక్షణమైన కథాంశంతో.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన టీజర్‌తో పాటు పాటలకు మంచి స్పందన రాగా.. తాజాగా చిత్రయూనిట్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. (Malli Pelli Trailer Launched)
ట్రైలర్ విడుదల అనంతరం నరేష్ మాట్లాడుతూ (Naresh Speech).. నాకు ఊహ తెలిసినప్పటినుంచీ విజయనిర్మలగారు, కృష్ణగారు దేవుళ్ళు. వారి మేకప్ చైర్‌లోనే కూర్చుని పండంటి కాపురంకు మేకప్ వేసుకున్నాను. నటుడిని కావాలనేదే నా కోరిక. అలా నేను బాలనటుడిగా నటించిన ‘పండంటి కాపురం’ 1972లో రిలీజైంది. ఎస్.వి.రంగారావు వంటి హేమాహేమీల మధ్య నటించా. 1973లో నాతో అమ్మగారు ఆలోచనలను పంచుకున్నారు. అందుకే ఆ బేనర్ విలువ తెలుసు. ఇక మూడేళ్ల నాటి నుంచి ఎం.ఎస్.రాజుగారితో ట్రావెల్ అవుతున్నాను. రెబల్ కథతో సినిమా చేయాలనుకున్నా. ఈ సినిమా కథ గురించి ఆలోచిస్తుండగా విజయకృష్ణ మూవీస్ మరలా ప్రారంభించడానికి అద్భుతమైన కాన్సెప్ట్ కుదిరింది అనిపించింది. అందుకే చేశాం. ఇప్పుడు ట్రైలర్, టీజర్ చూశారు. ఇది మచ్చు తునక మాత్రమే.. సినిమాలో చాలా విషయం ఉంది. ఈ కథకు టైటిల్ ఏమి పెట్టాలని అనుకున్నప్పుడు గతంలో కృష్ణగారు, విజయనిర్మలగారు నటించిన ‘మళ్ళీ పెళ్లి’ గుర్తుకువచ్చి, అదే టైటిల్ పెట్టాలనిపించింది. ఈ కథకు కూడా యాప్ట్ అయిన టైటిల్. చాలా సంతోషంగా వుంది. గౌరవప్రదమైన సినిమా తీశాం.. గొప్ప అనుభూతిని మీకు అందిస్తాం. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకొచ్చారు.
అనంతరం ఈ సినిమా కథ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు నరేష్ సమాధానం ఇస్తూ.. రఘుపతివెంకయ్యనాయుడు బయోపిక్‌లో నేను నటించాను. కానీ ‘మళ్ళీ పెళ్లి’ సినిమా అనేది నా బయోపిక్ (Biopic) కాదు. ప్రతివారికి ఏదో ఒకచోట కనెక్ట్ అయ్యేలా రాజుగారు కథను తీసుకువచ్చారు. ఇది నా కథ కాదు అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*Harish Shankar: అప్పుడు 10 ఏళ్ల ఆకలి.. ఇప్పుడు ఇది నా 11 ఏళ్ల ఆకలి
*Ustaad Bhagat Singh: ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది
*Poonam Kaur: ‘ఉస్తాద్’ని కెలికిన పూనమ్ కౌర్.. ఉగ్రరూపం ప్రదర్శిస్తోన్న ఫ్యాన్స్
*Allu Arjun: 30 ఏళ్ల తర్వాత సడెన్‌గా ఆమెని చూసి షాకైన బన్నీ.. ఆమె ఎవరో తెలుసా?
*Kushboo: పెళ్ళి కోసం నేను మతం మారలేదు.. ‘కేరళ స్టోరీ’ విమర్శలపై ధీటైన సమాధానం
*NBK108: బ్రహ్మాజీకి కోపం వచ్చింది.. అందుకే డైరెక్టర్‌కి నమస్తే పెట్టేశాడు
*Aadi Saikumar: ఆది సినిమా.. ఒకటి కాదు.. రెండు ఓటీటీల్లో..