Madhave Madhusudana: ఎలాంటి వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవంటోన్న దర్శకనిర్మాత
ABN, First Publish Date - 2023-11-19T17:50:55+05:30
తేజ్ బొమ్మదేవర, రిషికి లొక్రే జంటగా నటించిన సినిమా ‘మాధవే మధుసూదన’. ఈ చిత్రాన్ని సాయి రత్న క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తూ దర్శకత్వం వహించారు బొమ్మదేవర రామచంద్ర రావు. బొమ్మదేవర శ్రీదేవి సమర్పిస్తున్న ఈ సినిమా.. ఈ నెల 24న గ్రాండ్‌గా విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించి చిత్ర విశేషాలను తెలియజేశారు.
తేజ్ బొమ్మదేవర (Tej Bommadevara), రిషికి లొక్రే (Rishiki Lokre) జంటగా నటించిన సినిమా ‘మాధవే మధుసూదన’ (Madhave Madhusudana). ఈ చిత్రాన్ని సాయి రత్న క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తూ దర్శకత్వం వహించారు బొమ్మదేవర రామచంద్ర రావు (Bommadevara Ramachandra Rao). బొమ్మదేవర శ్రీదేవి (Bommadevara Sridevi) సమర్పిస్తున్న ఈ సినిమా.. ఈ నెల 24న గ్రాండ్‌గా విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో మేకర్స్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో యాక్టర్ సుమన్ (Suman) మాట్లాడుతూ.. ‘మాధవే మధుసూదన’ సినిమాను దర్శకుడు బొమ్మదేవర రామచంద్ర రావు చాలా క్లారిటీగా రూపొందించారు. ఆయనకు చాలా అనుభవం ఉంది. ఎంతోమంది దర్శకులను చూశారు. ప్రతి సీన్ తెరకెక్కించేప్పుడు బొమ్మదేవర రామచంద్ర రావు అనుభవం నాకు కనిపించింది. కెమెరామెన్ వాసు ప్రతి ఫ్రేమ్‌ను చక్కగా పిక్చరైజ్ చేశారు. ఏ సినిమా బాగా రావాలన్నా డైరెక్టర్, స్టోరి, టెక్నీషియన్స్ కీలకం. ఈ సినిమాకు ఆ టీమ్ బాగా కుదిరింది. ఆర్టిస్టులు కూడా కొత్త వాళ్లు అయినప్పటికీ బాగా ప్రిపేర్ అయి నటించారు. ఈ సినిమాతో బొమ్మదేవర రామచంద్రరావు తన కొడుకు తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. అతను మంచి హీరో అవుతాడు. డ్యాన్సులు, ఫైట్స్, ఎమోషన్, కామెడీ అన్ని ఎలిమెంట్స్ బాగా పర్‌ఫార్మ్ చేస్తున్నాడు. అతనికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. రామచంద్రరావు మిగతా హీరోలతో కూడా సినిమాలు చేయాలి. వికాస్ చేసిన పాటలు చాలా బాగుంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా ఇది. థియేటర్స్‌కు వెళ్లి చూడమని కోరుతున్నానని అన్నారు.
దర్శక, నిర్మాత బొమ్మదేవర రామచంద్రరావు (Bommadevara Ramachandra Rao) మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో నాకు 45 ఏళ్ల అనుభవం ఉంది. టచప్ బాయ్ నుంచి మేకప్‌మ్యాన్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాను. నాగార్జున గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు అందరు స్టార్ డైరెక్టర్స్‌తో అనుబంధం ఏర్పడింది. వాళ్లు సీన్స్ ఎలా చేస్తున్నారు, ఏ షాట్ ఎలా పిక్చరైజ్ చేస్తున్నారు అనేది పరిశీలించేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి డైరెక్షన్ చేయాలనే కోరిక ఉండటం ఇందుకు కారణం. నేను కూడా ఇలా ఏదో ఒకరోజు డైరెక్షన్ చేయాలని కోరుకున్నాను. మంచి కథ సిద్ధం చేసుకుని కొందరు హీరోలను అప్రోచ్ అయ్యాను. నేనే డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా చేస్తానని చెప్పడంతో వాళ్లలో ఏవైనా సందేహాలు కలిగి ఉండొచ్చు.. లేదా రిస్క్ ఎందుకని అనుకోవచ్చు. వాళ్లు సినిమా చేసేందుకు ముందుకు రాలేదు. అప్పుడు మా అబ్బాయినే హీరోగా పెట్టి సినిమా చేయాలనుకున్నాను. నేను వెళ్లి మా అబ్బాయి తేజ్‌ను అడిగితే.. అతనికి కూడా మనసులో హీరో కావాలని ఉంది. కానీ నేను ఏమంటానో అని చెప్పడం లేదని తెలిసింది. అలా కాలేజ్ పూర్తయ్యాక ఏడాది పాటు ట్రైనింగ్ ఇచ్చి మా అబ్బాయి తేజ్ హీరోగా ఈ సినిమా స్టార్ట్ చేశాను. నేను ఆశించినట్లే మా అబ్బాయి బాగా నటించాడు. హీరోయిన్ కూడా చక్కగా చేసింది. మా సినిమాటోగ్రాఫర్ వాసు నేను అనుకున్నట్లుగా సీన్స్ తీశాడు. మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ నాలుగు మంచి పాటలు ఇచ్చాడు. పాట సందర్భం తెలుసుకుని పర్ఫెక్ట్‌గా ట్యూన్ చేశాడు. సినిమాలో ఎలాంటి వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. మా సినిమా బాగా చేశామని మేము చెప్పుకోవడం కాదు.. ప్రేక్షకులు స్పందన కోసం వేచి చూస్తున్నాం. నవంబర్ 24 ఈ సినిమా విడుదలవుతుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ ప్రభు, డైలాగ్స్ రైటర్ సుదర్శన్.. యాక్టర్స్ నవీన్ నేని, రవి శివతేజ, హీరో తేజ్ బొమ్మదేవర వంటి వారంతా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
ఇవి కూడా చదవండి:
====================
*Karthika Nair: రాధ కుమార్తె కార్తీక నాయర్ పెళ్లిలో సినీ ప్రముఖుల సందడి
*******************************
*Yatra Raja: ధనుష్ పెద్ద కుమారుడికి జరిమానా.. ఎందుకంటే?
********************************
*Panja Vaishnav Tej: ‘వరుణ్‌లవ్’ వెడ్డింగ్ పార్టీలో రీతూ వర్మ.. రూమర్స్‌కు వైష్ణవ్ చెక్
****************************
*CWC23Final: మహేష్ బాబు ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లాలంటూ మీమ్స్.. ఎందుకంటే?
*******************************
*Raghava Lawrence: రజనీ రూపంలో రాఘవేంద్రుడిని చూశా..
*******************************