Devil: ‘డెవిల్’లోని ‘మాయే చేసి’ పాట కోసం ఎలాంటి వాయిద్యాలు వాడారో చూశారా?
ABN, First Publish Date - 2023-09-23T10:54:59+05:30
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న మరో వైవిధ్య చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్‌లైన్. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మాయే చేసి’ని మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దర్శక నిర్మాత అభిషేక్ నామా, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్దన్ రామేశ్వర్ ద్వయం కలిసి క్రియేట్ చేసిన ఈ వింటేజ్ సాంగ్‌కు రకరకాల వాయిద్యాలు వాడారు.
కెరీర్ ప్రారంభం నుంచి విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram). ఇప్పుడాయన హీరోగా నటిస్తోన్న మరో వైవిధ్య చిత్రం ‘డెవిల్’ (Devil). ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్‌లైన్. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మాయే చేసి’ని మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ (Samyuktha Menen) ల మధ్య ప్రేమను చూపించింది. పాటలో ఇద్దరి కెమిస్ట్రీ ఆకర్షణీయగా ఉంది.
‘డెవిల్’ సినిమా 1940లోని మదరాసి ప్రెసిడెన్సీ నేపథ్యంలో సాగుతుంది. అంటే స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న బ్యాక్ డ్రాప్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. సన్నివేశాలు, పాటలను కూడా అలాగే చిత్రీకరించారు. కాస్ట్యూమ్స్, బ్యాగ్రౌండ్ ఇలా ప్రతీ విషయంలో మేకర్స్ పలు జాగ్రత్తలను తీసుకున్నారు. నాటి కాలాన్ని, నాటి సంగీతాన్ని తెరపై చూపించే క్రమంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా (Abhishek Nama) దక్షిణ భారత దేశపు సహజమైన లొకేషన్లను ఎంచుకున్నారు. కారైకుడిలోని ప్యాలెస్‌లో ఈ పాటను చిత్రీకరించారు.
నాటి కాలంలోకి తీసుకెళ్లేందుకు సంగీతం కూడా ఎంతో ఉపయోగపడింది. సంగీతం విషయంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్దన్ రామేశ్వర్ (Harshavardhan Rameshwar) ద్వయం కలిసి ఇలాంటి వింటేజ్ సాంగ్‌ను క్రియేట్ చేశారు. ఈ పాటలో రకరకాల వాయిద్యాలు వాడారు. దక్షిణాఫ్రికా నుంచి జెంబో, బొంగొ, డీజెంబోలు.. మలేసియా నుంచి డఫ్ డ్రమ్స్.. చైనా నుంచి మౌత్ ఆర్గాన్, దర్భుకా.. దుబాయ్ నుంచి ఓషియన్ పర్‌క్యూషన్, సింగపూర్ నుంచి ఫైబర్ కాంగో డ్రమ్స్, వెస్ట్ ఆఫ్రికా నుంచి హవర్ గ్లాస్, షేప్డ్ టాకింగ్ డ్రమ్ ఇలా రకరకాల వాయిద్యాలను ఈ పాటలో వాడారు. వీటి వాడకంతోనే శ్రోతలను నాటి కాలానికి, వింటేజ్ మూడ్‌లోకి తీసుకెళ్లారు. సింగర్ సిద్ శ్రీరామ్ (Sid Sriram) వాయిస్‌తో వచ్చిన ఈ పాట ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది.
ఇవి కూడా చదవండి:
============================
*Kumari Srimathi: నిత్యా మీనన్.. ఈ శ్రీమతి ఇంకా కుమారే.. ఆకర్షణీయంగా ట్రైలర్
************************************
*Producer Atluri Narayana Rao: అక్రమ కేసులు పెట్టి, జైల్లో పెట్టిన బాబును వెంటనే రిలీజ్ చేయాలి
*************************************
*Megastar Chiranjeevi: మెగాస్టార్ సినీ జర్నీకి 45 సంవత్సరాలు.. గ్లోబల్ స్టార్ అభినందనలు
***************************************
*Agent: ఎప్పుడెప్పుడా అనుకుంటున్న ‘ఏజెంట్’ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడోచ్..
*********************************