సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

L.G.M: ఎం.ఎస్. ధోనీ నిర్మిస్తున్న చిత్ర ఫస్ట్ లుక్ వచ్చేసింది

ABN, First Publish Date - 2023-04-11T21:37:26+05:30

ఎల్‌జీఎం’ (LGM) ప్రారంభమైనప్పటి నుంచి వార్తలలో వినిపిస్తూనే ఉంది. రమేష్ తమిళ్ మణి (Ramesh Thamilmani) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని

LGM First Look
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లెజెండరీ ఇండియన్ క్రికెటర్ ఎంఎస్ ధోని (MS Dhoni), సాక్షి ధోని (Sakshi Dhoni) నిర్మాణ సంస్థ ధోని ఎంటర్‌టైన్‌మెంట్ తొలి ప్రాజెక్ట్ ‘ఎల్‌జీఎం’ (LGM) ప్రారంభమైనప్పటి నుంచి వార్తలలో వినిపిస్తూనే ఉంది. రమేష్ తమిళ్ మణి (Ramesh Thamilmani) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని ధోనీ తన అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీ ద్వారా విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై గ్లోబల్ స్థాయిలో చర్చలు మొదలయ్యాయి. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్, నదియా, ఇవానా టైటిల్ రోల్స్‌ పోషిస్తున్నారు. (First Look of LGM)

తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో హరీష్ కళ్యాణ్ (Harish Kalyan), నదియా (Nadiya), ఇవానా(Ivana)లనే హైలెట్ చేశారు. ‘లెట్స్ గెట్ మ్యారీడ్ (LGM)’ అనేది ఈ చిత్రానికి పూర్తి టైటిల్. అందుకు తగ్గట్టే ఈ ఫస్ట్‌లుక్‌లో నిశ్చితార్థపు ఉంగరాన్ని ముగ్గురి నడుముకి బంధించారు. హీరో పట్టుకున్న బాక్స్‌లో రింగ్ లేదు. హీరోని.. హీరోయిన్, నదియ కోపంగా చూస్తున్నారు. వారి నిలబడి ఉన్న లొకేషన్, అందులో రింగ్ రోడ్.. పల్లెటూరి వాతావరణం.. మొత్తంగా చూస్తే.. ఇది ఎలాంటి సినిమానో ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చేలా ఈ ఫస్ట్ లుక్‌ ఉంది.

ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా.. చిత్ర నిర్మాత వికాస్ హసిజా హర్షం వ్యక్తం చేస్తూ ‘ఎల్‌జిఎం’ చిత్రం అద్భుతంగా రూపొందుతోంది. షూటింగ్ చివరి షెడ్యూల్‌లో ఉన్నాము. త్వరలో పోస్ట్-ప్రొడక్షన్‌కి వెళ్తాము. ఇది గ్రేట్ జర్నీ అని తెలిపారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రియాంషు చోప్రా మాట్లాడుతూ.. సినిమాలో చాలా సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ వుంటాయి. మొత్తం నటీనటులు, సిబ్బంది చాలా ప్రతిభావంతులు. చాలా ఫ్రెష్ కాన్సెప్ట్‌తో సినిమా రాబోతుందని అన్నారు. కాగా.. యోగి బాబు (Yogi Babu), మిర్చి విజయ్ (Mirchi Vijay) వంటి ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు రమేష్ తమిళ్ మణినే సంగీతం కూడా సమకూర్చుతున్నారు. (LGM Movie Update)

ఇవి కూడా చదవండి:

*********************************

*All India NTR Fans: ‘సింహాద్రి’ని అందుకే రీ రిలీజ్ చేస్తున్నాం తప్ప.. స్వలాభం కోసం కాదు

*Ram Charan and Upasana: మాల్దీవుల్లో ఉన్నా.. మరిచిపోలేదండోయ్..

*Allu Aravind: సాయిధరమ్ ఫోన్ చేస్తుంటే.. గీతా ఆర్ట్స్‌లో సినిమా అడుగుతాడనుకున్నా.. కానీ?

*Raghava Lawrence: రామ్ చరణ్‌లో నాకు నచ్చింది ఏమిటంటే..

*Samantha: నేను ఫేస్ చేసిన స‌మ‌స్య‌ల వ‌ల్లే.. ఇప్పుడిలా మారిపోయా!

*NTR 2 NTR: ‘ఆది’.. జూనియర్ ఎన్టీఆర్ టు సీనియర్ ఎన్టీఆర్.. మాస్ అప్‌డేట్

*Renu Desai: నా బాధ అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నందుకు ధైర్యంగా ఉంది

Updated Date - 2023-04-11T21:41:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!