Srikanth: ఈ మధ్యకాలంలో నాకు ఏ చిత్రానికి ఇన్ని ప్రశంసలు రాలేదు
ABN, First Publish Date - 2023-11-25T17:29:13+05:30
శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన తారాగణంగా తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటుండటంతో మేకర్స్ థ్యాంక్స్ మీట్‌ని నిర్వహించారు.
శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన తారాగణంగా తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళుతోంది. ఈ సందర్భంగా శనివారం చిత్రయూనిట్ థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించారు. (Kota Bommali PS Thanks Meet)
ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన బన్నీవాస్ (Bunny Vas) మాట్లాడుతూ.. సినిమా కంటెంట్ బాగుంటే మీడియా తప్పకుండా ప్రోత్సహిస్తుందనే విషయాన్ని.. ఈ చిత్రానికి వారు అందిస్తున్న సపోర్ట్‌తో మరోసారి నిరూపితమైంది. ‘నాయట్టు’ అనే క్లాసిక్ చిత్రాన్ని తెలుగులో కమర్షియల్ హంగులతో చేస్తున్నప్పుడు మొదట్లో కాస్త భయపడ్డాను. కానీ ఈ రోజు ఆడియెన్స్, మీడియా రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంగా వుంది. నిజాయితీగా సినిమా చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మార్నింగ్ వసూళ్లు తక్కువ వున్నా ఫస్ట్ షో టైమ్‌కు మౌత్‌టాక్‌తో కలెక్షన్లు పెరిగాయి. ఇదే మా సినిమా సక్సెస్‌కు నిదర్శనం. ఓ మంచి సినిమా తీశాను.. అది జనాలకు నచ్చిందనే విషయాన్ని మాత్రం కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. తేజ మార్ని ఎంతో ప్రతిభ గల దర్శకుడు. ఈ రోజు చిత్రంలో ప్రతి సన్నివేశానికి క్లాప్స్ పడుతున్నాయంటే అతనే కారణం. భవిష్యత్‌లో అతను మంచి కమర్షియల్ దర్శకుడిగా ఎదుగుతాడు. శ్రీకాంత్ అన్నయ్య సొసైటీకి ఉపయోగపడే పాత్ర ఎప్పుడు చేసినా.. ఆ సినిమా సక్సెస్ అవుతుందని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. తప్పకుండా ఈ చిత్రం మరింత జనాదరణ పొందుతుందనే నమ్మకం వుందని అన్నారు.
హీరో శ్రీకాంత్ (Hero Srikanth) మాట్లాడుతూ.. మీడియా మిత్రులు చాలా మంది ఫోన్ చేసి అభినందిస్తుంటే ఆనందంగా వుంది. ‘ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన’ రోజులు గుర్తొచ్చాయని అందరూ అంటున్నారు. ఈ మధ్యకాలంలో నాకు ఏ చిత్రానికి ఇన్ని ప్రశంసలు రాలేదు. ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ వున్న నిర్మాతలు కావాలి. ఆ గట్స్ నాకు వాసు, విద్యలో కనిపించాయి. మొదట్లో ఈ చిత్రంలో నా పాత్రను చేయగలనా అనుకున్నాను. కానీ ధైర్యంగా ఛాలెంజింగ్‌గా తీసుకుని చేశాను. నా కెరీర్‌ను మలుపుతిప్పిన గీతా ఆర్ట్స్ (Geetha Arts) సంస్థలో మళ్లీ నాకు మరో మంచి సక్సెస్ రావడం సంతోషంగా వుంది. ఈ చిత్ర దర్శకుడు తేజ గొప్ప దర్శకుడిగా మంచి స్థాయికి వెళతాడని అన్నారు.
ఎంతో కష్టపడి, అందరి సహకారంతో చేసిన ఈ సినిమాకు ఈ రోజు ఇంత మంచి ఆదరణ దొరకడం హ్యాపీగా వుందని దర్శకుడు తేజ మార్ని (Teja Marni) తెలిపారు. శివాని రాజశేఖర్ (Shivani Rajasekhar) మాట్లాడుతూ సినిమాలో నా నటన గురించి అందరూ అమ్మకు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. మంచి కంటెంట్‌తో సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పూడు ఆదరిస్తారని ఈ చిత్ర విజయం మరోసారి నిరూపించింది. మౌత్ టాక్‌తో ఈ సినిమాకు ఆదరణ పెరుగుతోంది. ఇదే ఈ చిత్ర సక్సెస్‌కు నిదర్శనమని అన్నారు. హీరో రాహుల్ విజయ్ (Rahul Vijay) మాట్లాడుతూ.. ఇదొక హానెస్ట్ అటెంప్ట్. సొసైటీలో జరుగుతున్న దానికి రిఫ్లక్షన్ ఇది. శ్రీకాంత్ గారి పాత్ర నా కళ్లలో నీళ్లు తెప్పించింది. నా పాత్రకు కూడా మంచి ప్రశంసలు వస్తున్నాయి అన్నారు. సినిమా విజయం పట్ల సహ నిర్మాత భాను తన సంతోషాన్ని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
====================
*Surya: డాడీతో పోలిక లేదు.. ఆ పేరు కూడా వాడుకోనంటోన్న విజయ్ సేతుపతి కుమారుడు
*******************************
*Natural Star Nani: సినిమా అనేది నిజంగా నా ఊపిరి.. దానిపై ప్రామిస్ చేస్తున్నా..
******************************
*Vikram Rathod: విజయ్ ఆంటోని సినిమాకు విడుదల తేదీ ఫిక్సయింది.
*******************************