కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Japan: దీపావళికి థియేటర్లలోకి.. ఈలోపే పోస్టర్స్‌తో పేల్చేస్తున్నారు

ABN, First Publish Date - 2023-10-17T15:37:37+05:30

హీరో కార్తీ సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులుంటారనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌‌గా రూపొందుతోన్న ‘జపాన్’ చిత్రంలో కార్తీ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలకు సంబంధించి, అలాగే చిత్ర విడుదలకు సంబంధించి మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. దీపావళికి ఈ చిత్రం విడుదల కానుంది.

Karthi in Japan

హీరో కార్తీ (Karthi) సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులుంటారనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ (Rajumurugan) దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌‌గా రూపొందుతోన్న ‘జపాన్’ (Japan) చిత్రంలో కార్తీ నటిస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ (Dream Warrior Pictures) పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్ర గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా టీజర్ విడుదలకు సంబంధించి, అలాగే చిత్ర విడుదలకు సంబంధించి మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. (Japan Movie Teaser and Movie Release Updates)

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌ని దీపావళికి విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. అతి త్వరలోనే టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా కూడా మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ విషయం తెలుపుతూ.. రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్తుంటే.. దీపావళి కంటే ముందే మేకర్స్ క్రాకర్స్‌ని పేల్చేసిన అనుభూతిని ఇస్తున్నారు. వీటిలో ఓ పోస్టర్‌లో ఒక చేతిలో గన్, మరో చేతిలో గ్లోబ్‌తో స్టన్నింగ్ లుక్‌లో కార్తీ కనిపించారు. (Karthi in Japan)


కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ (Anu Emmanuel) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో సునీల్ (Sunil) ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రంలో సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ (Vijay Milton) తొలిసారిగా నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ (కమ్మరసంభవం) వినేష్ బంగ్లాన్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌తో మేకర్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Sona: ఆ చిన్న పొరపాటు వల్లే నన్ను శృంగార తారను చేశారు

***************************************

*Akira Nandan: ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈవెంట్‌లో ఈ పేరే హాట్ టాపిక్..

***********************************

*Mistake: ఓటీటీలో ‘మిస్టేక్’కు మెరుపులాంటి స్పందన..

***********************************

*Extra Ordinary Man: ‘ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్‌’లో యాంగ్రీమ్యాన్.. లుక్ చూశారా?

**********************************

*Milan: ‘విడాముయర్చి’ షూటింగ్‌లో విషాదం.. అజిత్‌ ఫేవరేట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ మృతి

************************************

Updated Date - 2023-10-17T15:37:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!