కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandramukhi 2 : కంగనా సెక్యూరిటీ చూసి కంగారొచ్చింది

ABN, First Publish Date - 2023-09-24T02:24:01+05:30

రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘చంద్రముఖి 2’. పి.వాసు దర్శకుడు. సుభాస్కరన్‌ నిర్మాత. ఈనెల 28న విడుదల చేస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో చిత్రబృందం రెండో ట్రైలర్‌ని విడుదల చేసింది...

రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘చంద్రముఖి 2’. పి.వాసు దర్శకుడు. సుభాస్కరన్‌ నిర్మాత. ఈనెల 28న విడుదల చేస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో చిత్రబృందం రెండో ట్రైలర్‌ని విడుదల చేసింది. ఈ సందర్భంగా లారెన్స్‌ మాట్లాడుతూ ‘‘చంద్రముఖి నా ఫేవరెట్‌ సినిమా. అందులో రజనీకాంత్‌ చేసిన పాత్రని సీక్వెల్‌లో నేను చేయడం నా అదృష్టం. ఆయన ఆశీస్సులు నాకూ, ఈ చిత్రానికీ ఉన్నాయి. కంగనా లాంటి స్టార్‌ కథానాయికతో పని చేయడం గొప్ప అవకాశం. సెట్లో ఆమెని తొలి రోజు చూసినప్పుడు చుట్టూ చాలామంది సెక్యురిటీ గార్డులు ఉన్నారు. వాళ్లని చూస్తే కంగారు వచ్చింది. ఇదే విషయం కంగనాకు కూడా చెప్పా. దాంతో మరుసటి రోజు నుంచి సెక్యురిటీ తగ్గించేశార’’న్నారు. ‘‘చంద్రముఖి 2లో నేను నటిస్తా.. అని నాకు నేనుగా ఈ ప్రాజెక్టులో వచ్చా. ‘చంద్రముఖి’ సిరీస్‌ అంటే నాకు అంత ఇష్టం. ఈ సినిమాలో హారర్‌, థ్రిల్లర్‌ మాత్రమే కాదు. చాలా ఎమోషన్స్‌ ఉన్నాయి. ‘చంద్రముఖి’లో జ్యోతికను చంద్రముఖి ఆవహిస్తుంది. అయితే ఈ సినిమాలో నిజమైన చంద్రముఖి ఉంది. ఆ పాత్రలో నా నటన తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉంద’’న్నారు కంగనా. ‘‘పదిహేడేళ్ల ముందు కోట నుంచి వెళ్లిపోయిన చంద్రముఖి మళ్లీ ఎందుకొచ్చిందన్న పాయింట్‌తో పార్ట్‌ 2 సాగుతుంద’’న్నారు దర్శకుడు.

Updated Date - 2023-09-24T02:24:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!