కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Akash : ఆయనకు పాదాభివందనం చేయాలనుంది

ABN, Publish Date - Dec 30 , 2023 | 05:19 AM

ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాశ్‌ ‘సర్కార్‌ నౌకరి’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాశ్‌ ‘సర్కార్‌ నౌకరి’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మించిన ఈ చిత్రానికి గంగనమోని శేఖర్‌ దర్శకత్వం వహించారు. జనవరి ఒకటిన ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో ఆకాశ్‌ చిత్ర విశేషాలు మీడియాకు వెల్లడించారు.

పిల్లలు వారి తల్లితండ్రుల వృత్తినే అనుసరించాల్సిన అవసరం లేదు. మా అమ్మ సింగర్‌ అయినా నాకు చిన్నప్పటినుంచీ నటన అంటేనే ఇష్టం. నటుడు కావాలనే కోరిక చిన్నతనం నుంచి ఉంది. మా అమ్మకు చెబితే నీకు ఇంకా చాలా టైమ్‌ ఉంది అని చెప్పేది. చదువు పూర్తయ్యాక నా కల గురించి ఇంట్లో చెప్పా. నేను స్ర్టాంగ్‌ డెసిషన్‌తో ఉన్నానని అమ్మకు అర్థమై సరేనంది.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుగారి చేతుల మీదుగా నేను హీరోగా లాంచ్‌ కావడం నా జీవితంలో మరిచిపోలేను. ఎంతో మంది హీరోలు ఆయన ద్వారా పరిచయం అయ్యారు. ఆ లిస్ట్‌లో నా పేరు కూడా ఉండడం అదృష్టమే మరి! ఆయనకు రోజూ పాదాభివందనం చేయాలని ఉంది.

Updated Date - Dec 30 , 2023 | 09:24 AM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!