Samantha: నేను ఫేస్ చేసిన సమస్యల వల్లే.. ఇప్పుడిలా మారిపోయా!
ABN, First Publish Date - 2023-04-10T22:00:56+05:30
హీరోయిన్‌గా గుర్తింపు వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు లేవు. దాంతో హ్యాపీగా ఉన్నాను. అయితే ఈ ప్రయాణంలో నేను ఫేస్ చేసిన సమస్యలతో..
ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో రూపొందిన పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత (Samantha), దేవ్ మోహన్ (Dev Mohan) జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న భారీ స్థాయిలో విడుదలకాబోతోంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంతలంను రూపొందించారు గుణశేఖర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) దిల్ రాజు (Dil Raju) సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ (Neelima Guna) ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించారు. 3D టెక్నాలజీతో విజువల్ వండర్‌గా తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు దిల్‌రాజు, గుణ శేఖర్ అండ్ టీమ్. అందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమంత, దర్శకుడు గుణశేఖర్, నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ.. (Samantha about Shaakuntalam)
‘శాకుంతలం’ కథ గురించి చిన్నప్పుడు నాకు కొంచెం తెలుసు. పూర్తి వివరాలు తెలియవు. ఇది 5 శతాబ్దంలో రాసిన కథ. అయితే ఇప్పటి మోడ్రన్ అమ్మాయి అయిన నేను ఆ క్యారెక్టర్‌తో రిలేట్ అవుతున్నాను. శకుంతల పాత్ర నేటి అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది. నేను ప్రతి సినిమాకు నటిగా నా బెస్ట్ ఇస్తున్నాను. ఈ శకుంతల రోల్ చేయటం అనేది నటిగా నాకు ఓ పెద్ద బాధ్యత. ఈ పాత్ర అనుకున్నప్పుడు ముందు నేను భయపడ్డాను. అందుకనే గుణశేఖర్‌గారు అడగ్గానే నో చెప్పాను. నేను అప్పుడే రాజీ పాత్ర చేసి వచ్చాను. ఇప్పుడు చేసే శకుంతల పాత్రలో చాలా అందంగా కనిపించాలి. ప్రతీ ఫ్రేమ్‌లో అందంతో పాత్రలో ఓ డిగ్నిటీ, గ్రేస్ కనపడాలి. నేను ఆ పాత్రకు న్యాయం చేశాననే అనుకుంటున్నాను. అందుకు కారణం నా దర్శకుడు, నిర్మాత నా నటనపై సంతృప్తిగా ఉన్నారు.
శకుంతల, దుష్యంతుడితో ప్రేమలో పడుతుంది. అప్పటి సమాజానికి విరుద్ధంగా ఆమె వెళుతుంది. సమాజంలో ఆమె పాత్ర కోసం ఆమె పోరాడుతుంది. ఓటమిని అస్సలు ఒప్పుకోదు. నాకు తెలిసి ఆమె ఫస్ట్ సింగిల్ మదర్. ఇవన్నీ చూస్తుంటే ఇప్పటి మహిళల్లో చాలా మందికి ఆమె పాత్ర కనెక్టింగ్ అనే చెప్పాలి. గుణశేఖర్‌గారు నాకు శాకుంతలం కథ నెరేట్ చేసిన తర్వాత ఎలాంటి మైథిలాజికల్ మూవీస్ చూడొద్దని చెప్పారు. అందుకు కారణం.. ఆయన మైండ్‌లో శకుంతల పాత్ర గురించి క్లియర్ కట్ ఐడియా ఉంది. దాంతో నేను గుణశేఖర్‌గారి విజన్‌ను ఫాలో అయిపోతూ వచ్చాను. దాంతో ఇద్దరి ఆలోచనలు ఒకటిగా సాగాయి. దీంతో ఒకట్రెండు టేక్స్‌లోనే సన్నివేశాలను చేస్తూ వచ్చేశాను. (Samantha Speech)
నేను కొచ్చిలో శాకుంతలం త్రీడీ ట్రైలర్ చూసి షాకయ్యాను. అలా నోరెళ్ల బెట్టేశాను. చాలా ఎగ్జయిట్ అయ్యాను. అవతార్‌లాంటి సినిమాలను త్రీడీలో చూసినప్పుడు మనం ఆ ప్రపంచంలో పిల్లల్లాగా మారిపోతాం. అలాంటి మ్యాజికల్ ప్రపంచాన్ని గుణశేఖర్‌గారు శాకుంతలం కోసం క్రియేట్ చేశారు. ఈ సినిమాకు మూడు లాంగ్వేజెస్‌లో డబ్బింగ్ చెప్పాను. పాన్ ఇండియా సినిమా చేస్తున్నామన్న తర్వాత ఆ మాత్రం ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే అల్లు అర్హ (Allu Arha) స్క్రీన్ మీద కనిపించిన ప్రతీసారి ఆడియెన్స్ పెదవులపై ఓ చిరునవ్వు వచ్చేస్తుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు.
హీరోయిన్‌గా గుర్తింపు వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు లేవు. దాంతో హ్యాపీగా ఉన్నాను. అయితే ఈ ప్రయాణంలో నేను ఫేస్ చేసిన సమస్యల వల్ల ఇప్పుడిలా మారిపోయాను. సాధారణంగా సమస్యలు వచ్చినప్పుడు కచ్చితంగా అందరూ మారుతారు. నేను స్పెషల్ ఏమీ కాదు. స్టార్‌గా ఎదిగే క్రమంలో ఇండస్ట్రీ ఎంతగానో సపోర్ట్ ఇచ్చింది. నేను కమిట్ అయిన సినిమాలు సకాలంలో సెట్స్ పైకి వెళ్లకపోతే ముందుగా ఇబ్బంది పడేది నిర్మాతలే. అయినా వాళ్లెవ్వరూ నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు సినిమా షూటింగ్‌కు ఎప్పుడు వస్తారు? అని అడిగి ఇబ్బంది పెట్టలేదు. ఆరోగ్యవంతురాలిగా మారిన తర్వాతే రమ్మన్నారు. అక్కడ వాళ్లు తమ బంగారు హృదయాలను చూపించుకున్నారు. (Shaakuntalam Press Meet)
ఇవి కూడా చదవండి:
*********************************
*NTR 2 NTR: ‘ఆది’.. జూనియర్ ఎన్టీఆర్ టు సీనియర్ ఎన్టీఆర్.. మాస్ అప్‌డేట్
*Renu Desai: నా బాధ అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నందుకు ధైర్యంగా ఉంది
*MM Keeravani: వాళ్లు మూలవిరాట్లు.. మేము ఉత్సవ విగ్రహాలం
*Allu Aravind: రాజమౌళితో ‘మగధీర’ తీశానని గర్వంగా చెప్పుకుంటున్నా..
*Heroine-Director: ఇది కదా.. ఇప్పుడు ట్రెండ్!
*NT Ramarao: రాయలుగా రాజసం ఒలికించారు