గమ్యాన్ని చేరుకొన్నాడా
ABN, First Publish Date - 2023-08-22T00:19:52+05:30
విజయ్ రాజ్ కుమార్, నేహా పటాన్, అమితా రంగనాథ్, ఆమని కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్’. భరత్ మిత్ర దర్శకుడు. కిరణ్ కురువ, నవీన్ కురువ నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి...
విజయ్ రాజ్ కుమార్, నేహా పటాన్, అమితా రంగనాథ్, ఆమని కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్’. భరత్ మిత్ర దర్శకుడు. కిరణ్ కురువ, నవీన్ కురువ నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల 25న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘చదువు పూర్తయిన ప్రతీ కుర్రాడికీ ఎదురయ్యే ప్రశ్న... ‘ఏం చేస్తున్నావ్’ అనే. మా హీరో కూడా బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటాడు. తననీ ఇదే ప్రశ్న వెంటాడుతుంటుంది. మరి.. మా హీరో ఏం చేశాడు? తన గమ్యాన్ని ఎలా చేరుకొన్నాడు? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. తొలి సగం సరదాగా సాగిపోతుంది. ద్వితీయార్థం ఎవరి అంచనాలకూ అందని స్థాయిలో ఉంటుంది. గోపీ సుందర్ సంగీతం ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. సహ నిర్మాత: హేమంత్ రామసిద్ద.