Ramabanam Trailer Talk: ‘లక్ష్యం 2’ అనిపిస్తోంది
ABN, First Publish Date - 2023-04-21T11:38:46+05:30
రామబాణం చిత్ర థియేట్రికల్ ట్రైలర్ (Ramabanam Trailer)ను రాజమండ్రిలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే.. గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్‌లో ఇంతకు ముందు వచ్చిన..
మ్యాచో హీరో గోపీచంద్ (Gopichand), శ్రీవాస్ (Sriwass)ల హ్యాట్రిక్ చిత్రం ‘రామబాణం’ (Ramabanam). వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన ‘లక్ష్యం’ (Lakshyam), ‘లౌక్యం’ (Loukyam) సినిమాలు మంచి విజయాలు సాధించగా.. ఇప్పుడు యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో వీరు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సమ్మర్ కానుకగా మే 5న (Ramabanam Release Date) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రమోషన్స్‌ని యమా జోరుగా మేకర్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ (Ramabanam Trailer)ను రాజమండ్రిలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే.. గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్‌లో ఇంతకు ముందు వచ్చిన చిత్రాల మాదిరిగానే.. ఈ సినిమాలో కూడా మంచి కంటెంట్ ఉన్నట్లుగా అర్థమవుతోంది.
ట్రైలర్ విషయానికి వస్తే.. ‘ఈ క్షణం, ఈ ప్రయాణం.. నేను ఊహించినది కాదు, ప్లాన్ చేసింది కాదు’ అంటూ హీరో గోపీచంద్ వాయిస్‌తో ట్రైలర్ మొదలైంది. డింపుల్ హయాతి కోల్‌కతా నుంచి వ్లాగర్ (Dimple Hayathi)గా పరిచయం చేశారు. గోపీచంద్, డింపుల్ మధ్య లవ్ ట్రాక్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంటుందనే హింట్ ఇస్తూనే.. తర్వాత జగపతి బాబు (Jagapathi Babu)ని పరిచయం చేశారు. ఆరోగ్యకరమైన ఆహరం, ఆరోగ్యకరమైన బంధాల ప్రాముఖ్యత గురించి చెబుతూ గోపీచంద్ సోదరుడిగా జగ్గూభాయ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే జగపతి బాబు మంచి.. కార్పొరేట్ మాఫియా రూపంలో అతని కుటుంబానికి కష్టాలు తెచ్చిపెడుతుంది. ఇద్దరు బ్రదర్స్ కలిసి వారితో ఎలా పోరాడుతారు అనేదే ఈ సినిమా మెయిన్ థీమ్ అనేలా ట్రైలర్‌లో రివీల్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ‘లక్ష్యం’ సినిమాని మళ్లీ కాస్త మార్చి తీశారా? అనే భావన కూడా కలుగుతోంది. అలాగే ఇంతకు ముందు గోపీచంద్ నటించిన కొన్ని చిత్రాలు కూడా ఇదే స్టోరీలైన్‌లోనే ఉంటాయి. అయితే దర్శకుడు శ్రీవాస్ మాత్రం తన మార్క్‌ని ఈ ట్రైలర్‌లో ప్రదర్శించాడు (Ramabanam Trailer Talk).
గోపీచంద్ (Hero Gopichand) పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అతని స్టంట్స్ మాస్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి.. అలాగే తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. జగపతి బాబు ఎప్పటిలానే హుందాగా కనిపించారు. డింపుల్ హయాతి గ్లామర్ విందు ఇచ్చింది. ఖుష్బు (Khushbu) ఈ సినిమాకు మరో అసెట్ అనేలా ఉంది. వెన్నెల కిషోర్, అలీ, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను తదితరుల కావల్సినంత వినోదాన్ని పంచినట్లుగా అర్థమవుతోంది. యాక్షన్, కామెడీ సీక్వెన్స్‌లను శ్రీవాస్ డీల్ చేసిన విధానం కొత్తగా లేకపోయినా.. ఓవరాల్‌గా అయితే సినిమాలో ఏదో కుటుంబ విలువలకు సంబంధించిన విషయాన్ని చెబుతున్నాడనే విషయాన్ని మాత్రం ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. భూపతి రాజా (Bhupathi Raja) ఈ చిత్రానికి కథని అందించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory)పై టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad), సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల (Vivek Kuchibhotla) ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*Virupaksha Twitter Review: ‘విరూపాక్ష’ ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే..?
*Mrunal Thakur: ఈమె ‘సీతా రామం’ సీత అంటే ఎవరూ నమ్మరు కాక నమ్మరంతే..!
*Shamlee: 50కి పైగా చిత్రాల్లో నటించిన ‘ఓయ్’ షామ్లీ.. ప్రస్తుత టార్గెట్ ఏంటో తెలుసా?
*Pawan Kalyan: OG సెట్స్‌లో పవర్ స్టార్.. లుక్ అదిరిందిగా..!
*Ram Charan: భార్య కోసం రామ్ చరణ్ సంచలన నిర్ణయం
*Dasara: నాని ‘దసరా’ ఓటీటీ స్ట్రీమింగ్‌కి డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?