సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

State Government: వీరయ్య, వీరసింహానికి శుభవార్త

ABN, First Publish Date - 2023-01-10T22:33:04+05:30

సంక్రాంతికి విడుదలకాబోతోన్న ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya), ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) చిత్రాలకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్

Waltair Veerayya and Veera Simha Reddy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంక్రాంతికి విడుదలకాబోతోన్న ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya), ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) చిత్రాలకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ (Telangana State Government) శుభవార్త (Good News) తెలిపింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని థియేటర్లలో 6వ షో‌కు అనుమతులు ఇస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’.. ఈ రెండు సినిమాలు మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌లోనే రూపుదిద్దుకున్నాయి. ఈ బ్యానర్ నిర్మాతలు 6వ షోకు అనుమతి కోరగా.. ‘వీరసింహారెడ్డి’ చిత్రానికి జనవరి 12న (ఒక్కరోజు మాత్రమే), ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి జనవరి 13న (ఒక్కరోజు మాత్రమే).. ఎంపిక చేసిన థియేటర్లలో ఉదయం 4 గంటలకు స్పెషల్ షో వేసుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అనుమతితో చిత్రయూనిట్‌‌తో పాటు.. ఇరు హీరోల ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జనవరి 11న విడుదల కావాల్సిన ‘వారసుడు’ (Vaarasudu) చిత్రం వాయిదా పడటంతో.. ఆ సినిమాకు అనుకున్న థియేటర్లను ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలకు సరిసమానంగా కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒక రోజు ముందే వస్తున్న ‘వీరసింహారెడ్డి’కి మాత్రం అన్నివిధాలా ఇది కలిసొచ్చే అంశమని చెప్పుకోవాలి. జనవరి 12న ఎక్కువ థియేటర్లు ఆ సినిమాకి లభించనున్నాయి. 13న వచ్చే చిరంజీవి చిత్రానికి మాత్రం ఆ స్థాయిలో థియేటర్లు లభించవు. మరి దీనిని మైత్రీ వాళ్లు ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాల్సి ఉంది.

Updated Date - 2023-01-10T22:44:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!