కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shantala: ‘శాంతల’ను కొనియాడిన భారత మాజీ ఉపరాష్ట్రపతి

ABN, First Publish Date - 2023-11-11T19:20:10+05:30

ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై కె ఎస్ రామారావు సమర్పణలో.. అశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రలో నీహల్ హీరోగా త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో.. డాక్టర్ ఇర్రింకి సురేష్ నిర్మించిన పీరియడ్ చిత్రం ‘శాంతల’. ఈ చిత్రం నవంబర్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్రాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వీక్షించి సినిమా అద్భుతంగా ఉందని, కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని కొనియాడారు.

M Venkaiah Naidu with Shantala Team

ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై కె ఎస్ రామారావు (KS Ramarao) సమర్పణలో.. అశ్లేష ఠాకూర్ (Ashlesha Thakur) ప్రధాన పాత్రలో నీహల్ (Neehal) హీరోగా త్రివిక్రమ్ శేషు (Trivikram Seshu) దర్శకత్వంలో.. డాక్టర్ ఇర్రింకి సురేష్ నిర్మించిన పీరియడ్ చిత్రం ‘శాంతల’ (Shantala). ఈ చిత్రం నవంబర్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్రాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Former Vice President M Venkaiah Naidu) వీక్షించి సినిమా అద్భుతంగా ఉందని, కచ్చితంగా నేషనల్ అవార్డు (National Award) వస్తుందని కొనియాడారు.

ఈ సందర్భంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. శాంతల చలనచిత్ర ప్రివ్యూని శుక్రవారం వీక్షించాను. అద్భుతమైన కళాత్మక చిత్రం ఇది. నాట్య కళ, మహిళా సాధికారికత ఇతివృత్తంగా.. చారిత్రక నేపథ్యంలో నిర్మించిన చిత్రమిది. సినిమా చూస్తున్నప్పుడు నాకు కన్నీళ్లు ఆగలేదు. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. కొత్త నటీనటులైనప్పటికీ అద్భుతంగా నటించారు. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం. ఈ చిత్రం జాతీయ అవార్డులు సాధించగలదని ఆశిస్తున్నాను. ఇంత మంచి సినిమాని అందించినందుకు దర్శకుడు శేషును అభినందిస్తున్నాను. శేషు ఇంతకు ముందు అక్కినేని ఫ్యామిలీతో పని చేశారు. దర్శకుడిగా ఇది తన మొదటి చిత్రం. (M Venkaiah Naidu About Shantala)


నిర్మాణపరంగా, సాంకేతికంగా ఈ సినిమా ఎంతో ఉన్నతంగా ఉంది. కెమెరా పనితనం, నేపథ్య సంగీతం, నృత్యాలు, కూర్పు అద్భుతంగా ఉన్నాయి. ఇంతటి మంచి అభిరుచితో సినిమా నిర్మించిన నిర్మాత కె ఎస్ రామారావు, శ్రీ సత్య, దర్శకుడు శేషు బాబు, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ రమేష్, నటీనటులు అశ్లేష ఠాకూర్, నిహాల్, ఇతర సాంకేతిక సిబ్బంది అందరికీ నా అభినందనలు. నవంబర్ 24న తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ మరియు మలయాళం భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది’’ అని తెలిపారు. ‘సీతారామం’ ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


ఇవి కూడా చదవండి:

========================

*Producer: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

******************************

*Game Changer: అనుకున్నదే అయ్యింది.. ‘జరగండి’ దీపావళికి రావడం లేదు

******************************

*Salman Khan: నాకు, కత్రినాకు ఈ దీపావళి ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే?

*******************************

*Ala Ninnu Cheri: సినిమా చూసిన వారంతా చెబుతున్న మాట అదే..

********************************

Updated Date - 2023-11-11T19:20:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!