కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mahesh babu : మగజాతినట్టా మడతపెట్టి..

ABN, Publish Date - Dec 31 , 2023 | 04:54 AM

‘ఖైదీ రుద్రయ్య’లో ‘మంజువాణి ఇంటిలో మేజువాణీ.. రాతిరంత ఇక్కడే రాజధాని..’ సాంగ్‌ మాస్‌ని ఎంతగా అలరించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అసలు 80ల్లో సూపర్‌స్టార్‌ కృష్ణ చేసిన...

‘ఖైదీ రుద్రయ్య’లో ‘మంజువాణి ఇంటిలో మేజువాణీ.. రాతిరంత ఇక్కడే రాజధాని..’ సాంగ్‌ మాస్‌ని ఎంతగా అలరించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అసలు 80ల్లో సూపర్‌స్టార్‌ కృష్ణ చేసిన మాస్‌ సాంగ్స్‌ ఇప్పటికీ రూరల్‌ ఏరియాల్లో వినిపిస్తూనే ఉంటాయి. మరి ఆ తరహా పాటలు ఆయన వారుసుడైన మహేశ్‌కి ఉండబోతే ఎలా? అని త్రివిక్రమ్‌ అనుకున్నారేమో.. ‘గుంటూరుకారం’లో అలాంటి మాస్‌ బీట్‌ని యాడ్‌ చేశారు తివిక్రమ్‌. ‘మడతపెట్టీ..’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, తమన్‌ స్వరపరిచారు. ఈ పాటలో రామజోగయ్య సాహిత్యం కొంతపుంతలు తొక్కిందని చెప్పాలి. ‘రాజమండ్రి రాగమంజరి.. మాయమ్మ పేరు తెల్వనోళ్లు లేరు మేస్తిరి..’ అని శ్రీలీల అంటే.. ‘తూనీగ నడుములోన తూటాలెట్టి.. తుపాకీ పేల్చినావే తింగరి చిట్టీ.. మగజాతినట్టా మడతపెట్టీ..’ అంటూ మహేశ్‌ అంటాడు.. అభిమానులకు కిర్రెక్కించే సాహిత్యంతో చెలరేగిపోయారు రామజోగయ్య. మహేశ్‌బాబు, శ్రీలీలపై చిత్రీకరించిన ఈ మాస్‌ బీట్‌ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం తెలిపింది. జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరో కథానాయిక. రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్‌ పరమహంస, నిర్మాత: ఎస్‌.రాధాకృష్ణ.

Updated Date - Dec 31 , 2023 | 04:54 AM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!