కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mahesh Babu: మొదలైన 'గుంటూరు కారం' షూటింగ్, సంక్రాంతికి విడుదల... ?

ABN, First Publish Date - 2023-08-17T14:47:18+05:30

ఎట్టకేలకు మహేష్ బాబు నటిస్తున్న 'గుంటూరు కారం' షూటింగ్ ఈరోజు నుండి హైద్రాబాదులో మొదలైంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి చాలామంది క్యారెక్టర్ నటులున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టుగా తెలిసింది

Mahesh Babu in Guntur Kaaram

మహేష్ బాబు (MaheshBabu), దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' #GunturKaaram షూటింగ్ ఈరోజు అన్నపూర్ణ స్టూడియో లో మొదలైంది. తాజా సమాచారం ప్రకారం ఇందులో మహేష్ బాబుకి తాతగా వేస్తున్న ప్రకాష్ రాజ్ (PrakashRaj) ఇల్లు, ఆఫీస్ సెట్ లో కొన్ని సన్నివేశాలు తీస్తున్నట్టుగా తెలిసింది. చాలామంది క్యారెక్టర్ నటులు ఇందులో పాల్గొంటున్నట్టు కూడా తెలిసింది. ఈ ఇల్లు సెట్ వెయ్యడానికి కూడా భారీగా ఖర్చు పెట్టిన విషయం తెలిసిందే.

ఈరోజు సన్నివేశాల్లో ప్రకాష్ రాజ్ (PrakashRaj), మురళి శర్మ (MuraliSharma), వెన్నెల కిషోర్ (VennelaKishore), రావు రమేష్ (RaoRamesh), జయరాం (Jayaram), రమ్య కృష్ణ (RamyaKrishna) ఇలా చాలామంది ఉండొచ్చు అని అంటున్నారు. అభిమానులు ఆనందించే విషయం ఏమిటంటే ఎట్టకేలకి ఈ సినిమా షూటింగ్ మొదలైంది అని. చిత్రజ్యోతి ముందే చెప్పినట్టుగా మనోజ్ పరమహంస (ManojParamahamsa) సినిమాటోగ్రఫర్ గా, పీఎస్ వినోద్ (PSVinod) ప్లేస్ లో వచ్చారు. అతని ఆధ్వర్యంలోనే షూటింగ్ మొదలైంది అని తెలిసింది.

ఈరోజు చాలా కాంబినేషన్ సన్నివేశాలు వుంటాయని, ఈ షూటింగ్ ఈ నెలాఖరు వరకు ఉంటుందని కూడా తెలిసింది. మహేష్ బాబు కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటాడు అని కూడా యూనిట్ సభ్యుడు ఒకరు తెలిపారు. ఈ సినిమా రానున్న సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాతలు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మరి ఇప్పుడు మొదలు పెట్టి షూటింగ్ నవంబర్ కి పూర్తి చెయ్యగలరా లేదా అనే విషయం మీదే ఈ విడుదల తేదీ ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు. ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి (MeenkashiChaudhary) కథానాయకురాళ్లుగా చేస్తున్నారు.

Updated Date - 2023-08-17T14:47:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!