కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sasivadane: వినసొంపుగా.. ‘డీజే పిల్ల’ పాట

ABN, First Publish Date - 2023-09-04T22:32:46+05:30

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శశివదనే. ఈ సినిమా నుంచి ‘డీజే పిల్లా..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను సోమవారం మేకర్స్ విడుదల చేశారు.

‘నా దిల్లే నీ వల్లే

టూరింగు టాకీసులా మారెనే

నా కల్లో నీ బొమ్మనే

షో మీద షో వేసి చూపించనే

డీజే పిల్లా ఎదలో ఇల్లా

విజిలే వేసి బీటే కొట్టగా..’ అని కుర్రాడు తన ప్రేయసికి తన మనసులోని ప్రేమను పాట రూపంలో చెప్పేస్తున్నాడు. ఇంతకీ అబ్బాయి, అమ్మాయి మధ్య ఎందుకు ప్రేమ పుట్టింది. వారి ప్రేమ మజిలీ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ‘శశివదనే’ (Sasivadane) సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శశివదనే. ఈ సినిమా నుంచి ‘డీజే పిల్లా..’ (DJ Pilla) అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను సోమవారం మేకర్స్ విడుదల చేశారు.


ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ సాహిత్యాన్ని అందించగా వైషాగ్ పాటను ఆలపించారు. శరవణ వాసుదేవన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. గౌరి నాయుడు సమర్పణలో ఎ.జి.ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్ పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి మోహన్ ఉబ్బన (Sai Mohan Ubbana) దర్శకత్వం వహిస్తున్నారు. గోదావ‌రి బ్యాక్‌డ్రాప్‌లో అంద‌మైన ప్రేమ‌క‌థ‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

పాట విడుదల సందర్భంగా చిత్ర నిర్మాతలు అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ.. మా ‘శశివదనే’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. హార్ట్ టచింగ్ లవ్ కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కింది. మంచి లవ్ మూవీ వచ్చి చాలా రోజులవుతుందని అందరూ అనుకుంటున్నారు. వారి కోరిక ఈ సినిమాతో తీరుతుందని అనుకుంటున్నాను. మా హీరో రక్షిత్, హీరోయిన్ కోమలి ప్రసాద్ సినిమాలో అలా ఒదిగిపోయారంతే. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

============================

*Harish Shankar: ఆ కత్తులేంటి సామి.. భయపెట్టేస్తున్నావ్‌గా..!

*************************************

*Kushi: ‘ఖుషి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా.. సేఫ్ జోన్‌లోకి చేరుకున్నట్టే!

************************************

*Peddha Kapu-1: ‘పెదకాపు-1’ కూడా ఫిక్సయ్యాడు

*************************************

*Devil: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ గురించి ఈ విషయం తెలుసా..

*************************************

*Rules Ranjann: ‘సలార్’ డేట్‌కి ఫిక్సయిన ‘రూల్స్ రంజన్’.. క్లారిటీ కూడా ఇచ్చేశారు

************************************

Updated Date - 2023-09-04T22:32:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!