MS Dhoni: నా భార్య సినిమా అన్నప్పుడు.. నేను తనతో ఒకే మాట చెప్పా..
ABN, First Publish Date - 2023-07-12T22:49:35+05:30
ఇండియన్ క్రికెట్ హిస్టరీలో సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన మహేంద్ర సింగ్ ధోని.. ఇప్పుడు చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై LGM అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్, ఆడియో లాంచ్ కార్యక్రమం తాజాగా చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ధోని, సాక్షి.. ఈ సినిమా విశేషాలను తెలియజేశారు.
ఇండియన్ క్రికెట్ హిస్టరీలో సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. ఇప్పుడు చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ (Dhoni Entertainment) బ్యానర్‌పై LGM అనే సినిమాను రూపొందిస్తున్నారు. తమిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. హరీష్ కళ్యాణ్ (Harish Kalyan), ఇవానా (Ivana), నదియా (Nadiya), యోగిబాబు (Yogi Babu) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రమేష్ తమిళ్ మణి దర్శకత్వంలో ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాక్షి ధోని (Sakshi Dhoni), వికాస్ హస్జా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా చెన్నైలో జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో ధోని, ఆయన సతీమణి సాక్షి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) మాట్లాడుతూ.. ‘‘నేను సినిమా చూశాను. క్లీన్ మూవీ. చక్కటి ఎంటర్‌టైనర్. నేను నా కుమార్తెతో కలిసి ఎల్‌జీఎం సినిమా చూస్తాను. తను నన్ను చాలా ప్రశ్నలు వేస్తుంది. అయినా కూడా నేను తనతోనే సినిమా చూస్తాను. నటీనటులు, టెక్నీషియన్స్ అద్భుతంగా వర్క్ చేశారు. చాలా మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమాను నేను నిర్మించినందుకు గర్వంగా ఉంది. డైరెక్టర్ రమేష్ తమిళ్ మణి ఓ ఆర్కిటెక్ట్ కూడా. నా భార్య సినిమా చేయాలని నాతో చెప్పినప్పుడు నేను తనతో ఒకే మాట చెప్పాను. అదేంటంటే.. సినిమా చేయటం అంటే ఓ ఇంటిని డిజైన్ చేసినట్లు కాదని. నువ్వు ఓ కథను ఫిక్స్ చేసుకుని, నటీనటులను కూడా ఎంపిక చేసుకో. నువ్వు ఒక్కసారి ఓకే అన్న తర్వాత సినిమా చేస్తానని అన్నాను. అలా సినిమాను స్టార్ట్ చేశాం. మంచి టీమ్ కారణంగానే తక్కువ సమయంలోనే సినిమాను కంప్లీట్ చేశాం. సినిమా యూనిట్‌కు మంచి ఫుడ్ ఉండేలా చూసుకోమని చెప్పాను.
నేను విధిని నమ్ముతాను. నా టెస్ట్ కెరీర్ చెన్నై (Chennai)లోనే ప్రారంభమైంది. క్రికెట్ విషయానికి వస్తే హయ్యస్ట్ టెస్ట్ స్కోర్ కూడా చెన్నైలోనే సాధించాను. ఇలా చెన్నైతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడ ప్రజల ప్రేమాభిమానాలు చాలా గొప్పగా ఉన్నాయి. చాలా ఒడిదుడుకుల తర్వాత ఈ ఏడాది మళ్లీ మేం ఫామ్‌లోకి రావటం మరచిపోలేని విషయం. సీఎస్‌కే (CSK) టీమ్ ఎక్కడకు వెళ్లినా అక్కడ మాకు అపరిమితమైన ప్రేమ దొరికింది. ఇక ఎల్‌జీఎం సినిమా విషయానికి వస్తే త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తాం. ప్రతి ఒక్కరూ చాలా ఎంజాయ్ చేస్తారు. అత్త, కోడలు.. వారి మధ్యలో ఇబ్బంది పడే కొడుకు ఇలా ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన సినిమా ఇది’’ అని తెలిపారు.
ధోని భార్య సాక్షి ధోని మాట్లాడుతూ LGM సినిమా గురించి చెప్పాలంటే మన చుట్టూ చాలా మంది ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. ఇలాంటి పాయింట్ మీద సినిమా ఎందుకు చేయకూడదనిపించింది. అప్పుడు దర్శకుడు రమేష్‌తో మాట్లాడి సినిమాను స్టార్ట్ చేశాం. ఈ సినిమా ప్రత్యేకంగా తమిళంలోనే చేయటానికి కారణం ధోనీయే. చెన్నైతో మాకున్న అనుబంధం కారణంగా మా తొలి సినిమాను ఇక్కడే చేశామని అన్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన ధోనికి, సాక్షికి దర్శకుడు రమేష్ తమిళ్ మణి (Ramesh Thamilmani) ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Rashmika Mandanna: నితిన్, వెంకీ కుడుమల కాంబో ఫిల్మ్ నుంచి రష్మిక ఔట్.. కారణం ఏంటంటే?
**************************************
*Kavya Kalyanram: నేనలా ఎక్కడా చెప్పలేదు.. దయచేసి ఆ వార్తలు ఆపండి
**************************************
*Kushi Song: ‘ఆరాధ్య.. నువ్వేలేని ఏదీ వద్దు ఆరాధ్య’.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా..
**************************************
*Gandheevadhari Arjuna: అర్జునుడి రథంలోని అశ్వాల శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా..
**************************************
*Mahaveerudu: ‘మహావీరుడు’కి మాస్ మహారాజా సపోర్ట్.. ఏం చేశాడో తెలుసా?
**************************************