సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ajay Bhupathi: ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడి తర్వాత సినిమా టైటిల్‌పై కామెంట్స్.. ఇదేం టైటిల్‌ అంటూ..

ABN, First Publish Date - 2023-02-28T16:48:07+05:30

తొలి చిత్రం ‘ఆర్‌ఎక్స్ 100’‌ (RX 100)తో సక్సెస్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi) .. తన తర్వాత చిత్రం కోసం చాలా టైమ్ తీసుకున్నాడు. ఇద్దరు హీరోలతో ‘మహాసముద్రం’ (Maha Samudram) అంటూ వచ్చి బాక్సాఫీస్ వద్ద

Director Ajay Bhupathi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొలి చిత్రం ‘ఆర్‌ఎక్స్ 100’‌ (RX 100)తో సక్సెస్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi) .. తన తర్వాత చిత్రం కోసం చాలా టైమ్ తీసుకున్నాడు. ఇద్దరు హీరోలతో ‘మహాసముద్రం’ (Maha Samudram) అంటూ వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం చవిచూశాడు. ఆ సినిమా తర్వాత అజయ్ భూపతి చేసే సినిమా ఏమిటనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏ హీరో, అలాగే ప్రొడక్షన్ హౌస్ కూడా ఆయనతో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపడం లేదనేలా వార్తలు వైరల్ అయ్యాయి. ఇలాంటి వార్తల నేపథ్యంలో తాజాగా ఆయన తన తదుపరి సినిమా టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకుడే కాకుండా.. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ముద్ర మీడియా వర్క్స్ (Mudhra Media Works) బ్యానర్‌తో కలిసి తన ‘A’ క్రియేటివ్ వర్క్స్ (A Creative Works) బ్యానర్‌పై ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమా సౌత్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఆయన అనౌన్స్ చేసిన టైటిల్‌‌పైనే కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం. ‘ఇదేం టైటిల్..’ అంటూ నెటిజన్లు కొందరు చేస్తున్న కామెంట్స్‌తో.. ప్రస్తుతం ఈ టైటిల్ వైరల్ అవుతోంది. ఇంతకీ అజయ్ భూపతి తదుపరి సినిమా టైటిల్ ఏమిటనుకుంటున్నారు..? ‘మంగళవారం’. అవును.. అజయ్ భూపతి తదుపరి చిత్ర టైటిల్ ‘మంగళవారం’ (Mangalavaaram). మరో విశేషం ఏమిటంటే.. మంగళవారం రోజే ఈ టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేయడం. నిర్మాతగా అజయ్ భూపతికి తొలి చిత్రమిది.

ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ.. ‘‘కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించనటువంటి కొత్త జానర్‌లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాను. ‘మంగళవారం’ టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాలో 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకూ కథలో ప్రాముఖ్యం ఉంటుంది. ప్రతిదీ ఇంపార్టెంట్ క్యారెక్టరే’’ అని అన్నారు. (Ajay Bhupathi Next Film Title)

ముద్ర మీడియా వర్క్స్ నిర్మాతలు స్వాతి గునుపాటి, సురేష్ వర్మ. ఎం మాట్లాడుతూ.. ‘‘మాది పాన్ ఇండియా సినిమా కాదు, సౌత్ ఇండియన్ (South Indian) సినిమా. ‘ఆర్ఎక్స్ 100’తో అజయ్ భూపతి ఆడియన్స్‌ను ఎలా సర్‌ప్రైజ్ చేశారో, ఈ సినిమాతోనూ అదే విధంగా సర్‌ప్రైజ్ చేస్తారు. కాన్సెప్ట్ మరియు కంటెంట్ అంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. ‘కాంతార’ (Kantara) ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ (Ajaneesh Loknath) సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ ఇటీవల ప్రారంభించాం. నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

*********************************

Taraka Ratna : తారకరత్నతో దిగిన చివరి ఫొటో పోస్ట్ చేసిన అలేఖ్యారెడ్డి.. కంటతడి పెడుతున్న ఫ్యాన్స్..


Laya: పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన లయ

Krishnam Raju’s Wife: ఆస్కార్‌ దగ్గరలోనే ఉందనిపిస్తోంది

Chiranjeevi: రాజశేఖర్ చేసిన పనికి.. చిరు సెల్యూట్ చేశారు

Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

Nara Lokesh: మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. ‘వాల్తేరు వీరయ్య’ చూశా..

Rashmi Gautam: యాసిడ్ పోస్తారట.. కేసు పెట్టాలా? వద్దా?

GlobalStar Ram Charan: రామ్ చరణ్ రేంజ్ మారిపోయిందబ్బా..

Updated Date - 2023-02-28T16:49:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!