సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Waltair Veerayya Trailer: మాస్ అనే పదానికి బొడ్డుకోసి పేరెట్టిందే ఆయన్ని చూసి...

ABN, First Publish Date - 2023-01-07T19:12:49+05:30

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ మాహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), దర్శకుడు బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). సంక్రాంతి స్పెషల్‌గా..

Waltair Veerayya Movie Trailer Review
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ మాహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), దర్శకుడు బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 13న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ (Waltair Veerayya Trailer)ను మేకర్స్ విడుదల చేశారు. మొదటి నుంచి చెబుతున్నట్లుగానే.. ఈ ట్రైలర్‌తో అభిమానులకు పూనకాలు తెప్పించేశారు. ట్రైలర్‌ లోని ప్రతి షాట్.. వావ్ అనే రేంజ్‌లో ఫ్యాన్స్‌లో ఈలలతో గోల చేయించేలా ఉందంటే.. రేపు థియేటర్లలో అరాచకం ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ట్రైలర్ విషయానికి వస్తే.. ‘రా డిపార్ట్‌మెంట్ వాళ్లు ఓ ఇంటర్నేషనల్ క్రిమినల్‌ని తీసుకువస్తున్నారు. అతనొక డ్రగ్ స్మగ్లర్.. మా డిపార్ట్‌మెంట్ డేటాబేస్‌లో అతనొక పాపులర్ ఖైదీ. బీ కేర్ ఫుల్ గైస్.. అతనొక మాన్‌స్టర్..’ అంటూ సముద్రం నడిబొడ్డున బోట్‌పై మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీని చూపించారు. ఈ డైలాగ్స్ వినిపించే టైమ్‌లోనే డ్రగ్స్, పోలీస్ సెర్చింగ్‌కు సంబంధించిన అంశాలను కూడా మిక్స్ చేశారు. ‘మాస్ అనే పదానికి బొడ్డుకోసి పేరెట్టిందే ఆయన్ని చూసి.. ’ అనగానే ‘వీరయ్య, వాల్తేరు వీరయ్య’ అంటూ మెగాస్టార్ లుక్ రివీల్ చేశారు. కట్ చేస్తే.. మలేషియాలో డిఫరెంట్ షేడ్‌లో ఎంజాయ్ చేసే సీన్స్, సాంగ్స్‌తో వీరయ్య హిలేరియస్‌గా ఎంటర్‌టైన్ చేసే సన్నివేశాలను జోడించారు. మళ్లీ ‘ఏ పేటలో అమ్మాయిల జోలికి వచ్చినా నాకు ప్రాబ్లమే’ అనే డైలాగ్‌తో పాటు.. ఓ పిల్లాడు చెట్టుపై నుంచి ‘వీరయ్య’ అని అరవడం, ఆ తర్వాత కొన్ని ఎమోషనల్ సీన్స్‌, ఓ భారీ ఫైట్‌‌తో సినిమాలో సెంటిమెంట్ డోస్ రేంజ్‌ని పరిచయం చేశారు. ‘మీ కథలోకి నేను రాలా.. నా కథలోకే మీరు వచ్చారు’ అంటూ సినిమాలో ఉన్న విలన్స్ అందరినీ.. వారి గెటప్‌లతో సహా రివీల్ చేశారు. ‘వీడు నా ఎర.. నువ్వే నా సొర’ అంటూ వీరయ్య వార్నింగ్‌తో అప్పటి వరకు చిరు వేటాడితే.. అక్కడి నుంచి మాస్ రాజా రవితేజ ఎంటరయ్యాడు. (Waltair Veerayya Trailer Review)

‘వైజాగ్‌లో గట్టి వేటగాడు లేడని.. ఒక పులి పూనకాలతో ఊగుతుందట..’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్‌తో రవితేజ ఎంట్రీ.. ఆ తర్వాత చిరు, రవితేజల మిక్సింగ్‌తో కూడిన కొన్ని పవర్ ఫుల్ సీన్లు నడిచాయి. అనంతరం ‘రికార్డ్స్‌లో నీ పేరుందన్నమాట..’ అని విలన్ అంటే.. ‘రికార్డ్స్‌లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయ్’ అంటూ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే డైలాగ్‌తో పాటు, సముద్రంలో ఓ భారీ ఫైట్‌ని చిత్రీకరించినట్లుగా చూపించారు. ట్రైలర్‌ రన్నింగ్‌ 2 నిమిషాల 28 సెకన్లకు చేరుకుంది. అక్కడి నుంచి చిరు, రవితేజల మధ్య జరిగే సంభాషణకి ఇరు హీరోల ఫ్యాన్స్ కాలర్స్ ఎగరేయడం ఖాయం. ‘హలో మాస్టారూ.. ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి.. ఒక్కొక్కనికి బాక్స్‌లు బద్దలైపోతాయ్.. ’ అని రవితేజ అంటే.. ‘ఏంట్రా బద్దలయ్యేది.. ఈ సిటీకి నీలాంటి కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ ఇక్కడ వీరయ్య లోకల్..’ అంటూ చిరు ఆవేశంగా చెప్పే డైలాగ్, ఆ తర్వాత ఏనుగుతో కారు తొక్కించే సీన్‌తో ట్రైలర్ ముగించారు. మొత్తంగా అయితే.. పండుగకి ఎలాంటి సినిమా ప్రేక్షకులు కోరుకుంటారో.. అలాంటి సినిమాగా ఈ ‘వాల్తేరు వీరయ్య’ ఉండబోతుందని చెప్పవచ్చు. మేకింగ్, కెమెరా వర్క్, విజువల్స్, మ్యూజిక్ దేనికవే పోటీ అన్నట్లుగా ఉన్నాయి. సంక్రాంతికి బాక్స్‌లు బద్దలే.. పూనకాలు లోడైపోయాయ్.. ఇక జనవరి 13న ఊగిపోవడానికి ఫ్యాన్స్ ఫిక్సయిపోండి. (Waltair Veerayya Trailer Talk)

Updated Date - 2023-01-07T21:45:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!