Megastar Chiranjeevi: పరిశ్రమ సంఘాల కన్నా.. ఒక అడుగు ముందే!
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:15 PM
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. జూబిలీహిల్స్ నివాసంలో చిరంజీవి ఆయన్ని కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని (Revanth reddy) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)మర్యాదపూర్వకంగా కలిశారు. జూబిలీహిల్స్ నివాసంలో చిరంజీవి ఆయన్ని కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రేవంత్‌రెడ్డిని సీఎంగా ప్రకటించిన సమయంలో టాలీవుడ్ నుంచి ముందుగా అభినందనలు తెలిపిన వ్యక్తి చిరంజీవే!
గత నెలలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 7న సీఎంతో పాటు పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ రెండో సీఎంగా పదవీ బాధ్యతలు తీసుకున్న రేవంత్‌కు చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చిత్ర పరిశ్రమపై మండిపడ్డారు. ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం దిల్ రాజు మినహా పరిశ్రమకు సంబంధించిన ఎవరూ శుభాకాంక్షలు తెలపలేదని మీడియా సమావేశంలో తెలిపారు. తర్వాత దిల్ రాజు ఆధ్వర్యంలో చిత్ర పరిశ్రమకు చెందిన 24 శాఖల ప్రముఖులు మంత్రి కోమటిరెడ్డిని కలిశారు. డిసెంబర్ 21న సినీ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇచ్చారని వెల్లడించారు. అయితే 21న సినీ పెద్దలు ఎవరూ ముఖ్యమంత్రిని కలవలేదు. ఈలోపే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రేవంతరెడ్డిని కలవడం చర్చనీయాశంగా మారింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో సినీ ప్రముఖులకు అపాయింట్‌మెంట్ దక్కలేదా అన్న దిశగా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.