Biggboss 7: శివాజీ టార్గెట్... తగ్గేదేలే అంటూ సవాల్ విసిరాడు..
ABN, First Publish Date - 2023-11-27T14:35:42+05:30
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 (Biggboss 7) చివరి దశకు చేరుకొంది. ఆదివారం డబుల్ ఎలిమినేషన్ తో రతిక, అశ్విని ఇద్దరూ బయటకు వెళ్లిపోయారు. ఇంకా ఇంట్లో ఎనిమిది మంది మిగిలారు. వీరిలో టాప్ 5లో ఎవరుంటారు? (Top 5 contestents) ఫినాలేలో అడుగుపెట్టకుండానే ఎవరు తిరిగి వెళ్లిపోతారు?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 (Biggboss 7) చివరి దశకు చేరుకొంది. ఆదివారం డబుల్ ఎలిమినేషన్ తో రతిక, అశ్విని ఇద్దరూ బయటకు వెళ్లిపోయారు. ఇంకా ఇంట్లో ఎనిమిది మంది మిగిలారు. వీరిలో టాప్ 5లో ఎవరుంటారు? (Top 5 contestents) ఫినాలేలో అడుగుపెట్టకుండానే ఎవరు తిరిగి వెళ్లిపోతారు? అనేది ఆసక్తికరమైన చర్చగా మారింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడే ఛాన్స్ ఉన్నప్పటికీ రైతుబిడ్డ ఎవరికీ ఇవ్వడానికి ఇష్టపడలేదు. దీంతో ఇద్దరమ్మాయిలు ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయారు. గతవారం నిర్వహించిన చివరి కెప్టెన్సీ టాస్క్ రద్దు కావడానికి ముఖ్య కారణమైన శివాజీ, శోభాలను ఇంటి సభ్యులు టార్గెట్ చేశారు. దాంతో శివాజీకి వరుస నామినేషన్స్ పడ్డాయి. ‘‘మీ దృష్టిలో నామినేషన్ అనే నరకాన్ని ఎదుర్కొనే ఇద్దరు ఇంటి సభ్యులను నిర్ణయించి, అందుకు తగ్గకారణాలు చెప్పి పెయింట్‌ను వారి ముఖానికి పూయాల్సి ఉంటుంది’ అని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో గౌతమ్, ప్రియాంక, అర్జున్‌లు శివాజీని నామినేట్ చేశారు. ‘మీరు నా గేమ్‌ను చాలాసార్లు ఎంకరేజ్ చేశారు. దాని కన్నా కూడా నాపై ఎక్కువ నెగెటివిటీ పెట్టుకున్నారు’ అని ప్రియాంక కారణం చెప్పింది. ‘నీకు నచ్చకపోతే ఎదుటి వాళ్లను నువ్వు నెగెటివ్ చేస్తావు’ అని శివాజీ ఆమెకు బదులిచ్చాడు. (Final eliminations)
తదుపరి శివాజీని అర్జున్ నామినేట్ చేస్తూ ‘‘నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అది నాగ్ సర్ నోటి నుంచి వచ్చేసింది’ అని అనగా, ‘ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ అంటే, నేను నిజంగానే వేసుకున్నా. ఇది ఇంకా ఉంచుకుంటే, గేమ్ ఆడుతున్నామనే విషయం తెలుసుకోలేను. ఆ రోజు నువ్వొక మాట అన్నావు. ‘తెలియని మిత్రుడి కంటే, తెలిసిన శత్రువు బెటర్’. నీకు ఆ పాయింట్ మీద ఆసక్తి. అప్పుడే చెప్పేేస్త చాలా ఆనందించేవాడిని’’ అంటూ శివాజీ కౌంటర్ ఇచ్చాడు. దీంతో స్పందించిన అర్జున్ ‘నేను డ్రాప్ అయిపోతానన్న విషయం మీకు చెప్పకపోవడం నాదే మిస్టేక్’ అని చెప్పాడు. శివాజీని గౌతమ్ నామినేట్ చేశాడు. ‘మీరు అన్నమాట ప్రకారం.. బలహీనుల పక్కన నిలబడరు. మీరు రాజకీయంగా కరెక్ట్ కావచ్చేమో కానీ, మోరల్లీ కరెక్ట్‌కాదు.’ అని అనగా, ప్రశాంత్, యావర్ విషయంలో ఇక నుంచి నేను కలగజేసుకోను. ఇదే నా ఛాలెంజ్’ అని శివాజీ కౌంటర్ ఇచ్చారు. శోభాశెట్టిని నామినేట్ చేసినందుకో ఏమో కానీ ప్రిన్స్ యావర్, ప్రశాంత్.. సీరియల్ బ్యాచ్‌ను నామినేట్ చేశారు. అమర్‌ను మాత్రం ఎవరూ నామినేట్ చేయకపోవడం విశేషం. దీంతో ఈ వారం అమర్ మినహా మిగతా ఏడుగురూ నామినేషన్‌లో ఉన్నారు. దీంతో పైనల్‌కు ఎవరు వెళ్తారనేది ఆసక్తిగా మారింది.