Hard-Hitting Love Story: కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి.. ‘బేబీ’ మేకర్స్ తగ్గేదే లే..
ABN, First Publish Date - 2023-10-30T17:24:55+05:30
‘బేబి’ సినిమా కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి.. కలెక్షన్స్ పరంగానూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సినిమా తర్వాత అందులో నటించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యతో మరో సినిమాను అనౌన్స్ చేసిన మేకర్స్.. తాజాగా హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరితో వచ్చేందుకు సిద్ధమయ్యారు. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌కెఎన్, సాయి రాజేష్ నిర్మిస్తుండగా.. సుమన్ పాతూరి దర్శకత్వం వహించనున్నారు.
ఇటీవల వచ్చిన ‘బేబి’ (Baby) సినిమా కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి.. కలెక్షన్స్ పరంగానూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సినిమా తర్వాత అందులో నటించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యతో మరో సినిమాను అనౌన్స్ చేసిన మేకర్స్.. తాజాగా హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరితో వచ్చేందుకు సిద్ధమయ్యారు. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌కెఎన్ (SKN), సాయి రాజేష్ (Sai Rajesh) నిర్మిస్తుండగా.. సుమన్ కె పాతూరి (Suman K Pathuri) దర్శకత్వం వహించనున్నారు. ‘బేబి’ దర్శకుడు సాయి రాజేష్ (Sai Rajesh) ఈ సినిమాకు స్టోరీ - స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాని సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభించారు. ఇందులో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తుండగా.. యూట్యూబర్ దేత్తడి హారిక (అలేఖ్య హారిక) హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్ర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ప్రీ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎందుకంటే.. ఈ ప్రీ లుక్‌లోనే దేత్తడి హారిక, సంతోష్ శోభన్ (Santosh Soban) లిప్ లాక్‌తో రెచ్చిపోయారు. ఇదొక్కటి చాలు ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పడానికి అనేలా ప్రీ లుక్‌పై కామెంట్స్ పడుతున్నాయంటే.. ఏ రేంజ్ ఇంపాక్ట్‌ని ఇది కలిగించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఫుల్ సపోర్ట్ అందిస్తుండటం విశేషం. అదెలా అంటే.. ఈ సినిమా ఓపెనింగ్‌కు రావడమే కాకుండా.. చిత్ర ప్రీ లుక్‌ని కూడా ఆయనే విడుదల చేశారు. ‘‘సూపర్ టాలెంటెడ్ యాక్టర్ సంతోష్ శోభన్, హరికా అలేఖ్య కలిసి నటిస్తున్న నూతన చిత్రం యొక్క ఇంట్రెస్టింగ్ ప్రీ-లుక్ పోస్టర్‌ని విడుదల చేసినందుకు ఆనందంగా ఉంది. దర్శకనిర్మాతలకు నా శుభాకాంక్షలు’’ అంటూ నాగ చైతన్య (Naga Chaitanya) ట్వీట్ చేశారు.
చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైతూ.. క్లాప్ కొట్టడమే కాకుండా దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti)తో కలిసి యూనిట్‌కు స్ర్కిప్ట్‌ను అందించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి యువ హీరో సుశాంత్.. దర్శకులు హరీశ్ శంకర్, వశిష్ట.. మైత్రీ మూవీస్ ప్రొడ్యూసర్ వై. రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మూవీతో ఇప్పటి వరకు యూట్యూబ్‌లో సందడి చేసిన హారిక అలేఖ్య (Harika Alekhya) హీరోయిన్‌గా పరిచయం అవుతుండగా.. సరైన హిట్ కోసం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న సంతోష్ శోభన్.. ఖచ్చితంగా హిట్ కొడతామనే కాన్ఫిడెంట్‌తో ఉన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ.. మా అమృత ప్రొడక్షన్స్‌లో ‘కలర్ ఫొటో’ అనే సినిమా నిర్మించాను. దానికి నేషనల్ అవార్డ్ వచ్చింది. అయితే ఆ సక్సెస్ క్రేజ్‌లో వెంటనే సినిమా చేయలేదు. ఎందుకంటే మంచి కథ కుదిరినప్పుడే సినిమా నిర్మించాలని అనుకున్నా. అలాంటి కథ ఈ సినిమాకు సెట్ అయ్యింది. నేను, ఎస్‌కేఎన్ కలిసి ఆరు లవ్ స్టోరీస్ చేయాలని అనుకున్నాం. ‘కలర్ ఫొటో, బేబి’ వచ్చాయి. ఇప్పుడు ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నాం. ఈ మూవీతో కలిపి నాలుగు అయ్యాయి. మరో రెండు లవ్ స్టోరీస్ చేస్తాం. ఇవన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయా, సీక్వెల్సా అనేది ఇప్పుడే చెప్పలేను. ఇది నా మనసుకు దగ్గరైన కథ. నేను, ఎస్‌కేఎన్, సందీప్ రాజ్, అలేఖ్య మేమంతా ఫ్రెండ్స్. ఈ సినిమా నా ఫ్రెండ్స్‌తో కలిసి చేస్తున్నా కాబట్టి మరింత బాధ్యతగా ఫీలవుతున్నా. అన్ని క్రాఫ్టుల్లో ఈ సినిమాను ది బెస్ట్ గా తీసుకొస్తాం. యాక్టింగ్ వైపు ప్రాణం పెట్టే హీరో కావాలనుకున్నప్పుడు నాకు సంతోష్ శోభన్ గుర్తొచ్చారని అన్నారు
ఇవి కూడా చదవండి:
========================
*Vignesh Shivan: ఆ సినిమా మా బ్యానర్‌కు దక్కిన సముచిత గౌరవం
*********************************
*Vijay Deverakonda: మా అందరినీ కలిపింది సినిమానే..
**********************************
*MLC Kavitha: మెగాస్టార్ చిరంజీవి తర్వాత కవితకు ఏ హీరో ఇష్టమంటే..
***********************************