Anil Ravipudi : రాజకీయ పార్టీ పెడుతున్నానంటూ.. దర్శకుడి వైరల్ వీడియో
ABN, First Publish Date - 2023-11-17T13:41:46+05:30
'’నేను బాక్సాఫీస్ విజయాన్ని రుచి చూశాను, ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ విజయం కోసం ఎదురుచూస్తున్నాను. త్వరలో కొత్త పార్టీ పెడుతున్నాను. అభ్యర్థులను ప్రకటిస్తాను’ అని దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) చెబుతున్న వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది.
'’నేను బాక్సాఫీస్ విజయాన్ని రుచి చూశాను, ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ విజయం కోసం ఎదురుచూస్తున్నాను. త్వరలో కొత్త పార్టీ పెడుతున్నాను. అభ్యర్థులను ప్రకటిస్తాను’ అని దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) చెబుతున్న వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. అంతే కాదు.. దర్శకుడిగా పీక్స్‌లో ఉన్న అనిల్ రాజకీయాల్లో వెళ్తున్నాడా? (political Video Viral) అంటూ చర్చలు మొదలెట్టేశారు నెటిజన్లు. తాజాగా 'భగవంత కేసరి’ ((Bhagavanth kesari) చిత్రంతో హిట్ అందుకున్న ఆయన రాజకీయ నాయకుడిలా అవతారమెత్తి కనిపిస్తున్న వీడియో అభిమానులను అర్థం కాని పరిస్థితిలో పడేసింది. ఇంతకీ ఆ వీడియో క్లిప్‌లో అనిల్ ఏం చెప్పారంటే...
'నేను డైరెక్ట్ చేశా.. మీరు హిట్ చేశారు. నేను ఎంటర్‌టైన్ చేశాను.. మీరు ఎంటర్‌టైన్ అయ్యారు. గెలిచేది నేను అయినా... గెలిపించేది మీరే! ఈ సారి గెలుపు థియేటర్‌లో కాదు.. ఓ అసెంబ్లీ, పార్లమెంట్.. ఇలా ప్లాన్ చేశా. మీ ఎలాగు పంపిస్తారుగా? పంపిస్తారులే! బాక్సాఫీస్ సక్సెస్ చూసిన నాకు బ్యాలెట్ బాక్స్ సక్సెస్ చూడాలనుంది. అదేనండీ మనం పార్టీ పెట్టబోతున్నాం. మన పార్టీ పేరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు అనేది పూర్తి సమాచారంతో త్వరలో వస్తా’’ అని తెలిపారు. దాంతో కొందరు నిజంగానే రాజకీయ పార్టీ పెడుతున్నాడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో పోస్ట్ చేసింది అనిల్ కాదు. తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా’ పోస్ట్ చేసింది. అయితే దీన్ని బట్టి అనిల్ ఏదో పొలిటికల్ వెబ్ షో ఏదో ప్లాన్ చేశాడని తెలుస్తోంది. అయితే దీని గురించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. అసలు విషయం ఏంటో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే!