కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hi Nanna: ‘అమ్మాడి’ పాటతో కట్టిపడేస్తోన్న అమ్మాడి..

ABN, First Publish Date - 2023-11-04T20:25:31+05:30

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, శౌర్యువ్, వైర ఎంటర్టైన్మెంట్స్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘హాయ్ నాన్న’. తాజాగా ఈ సినిమా నుంచి బ్లిస్ ఫుల్ మెలోడీ ‘అమ్మాడి’ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మొదటి రెండు పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా విడుదలైన పాట కూడా టాప్‌లో ట్రెండ్ అవుతూ.. ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

Hi Nanna Movie Still

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) సినిమాల్లో పాటలకు ప్రత్యేకంగా ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రస్తుతం శౌర్యువ్ (Shouryuv) దర్శకత్వంలో నాని నటించిన పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్నా’ (Hi Nanna) కూడా డిఫరెంట్ జోనర్ సాంగ్స్ ఆల్బమ్‌‌తో అలరిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన రెండు పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా.. శనివారం ఈ సినిమా నుంచి మూడో సింగిల్ ‘అమ్మాడి’ (Ammaadi Lyrical Video Song) పాటను మేకర్స్ విడుదల చేశారు. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తన థర్డ్ యానివర్సరీని రివీల్ చేస్తూ తన పెర్‌ఫార్మెన్స్‌తో పాట ప్రారంభమైంది.

“ఇది నా భర్తకు అంకితం చేస్తున్న చాలా ప్రత్యేకమైన పాట. అతను ఎప్పటిలాగే ఆలస్యంగా వస్తున్నారు. పాట నా మాతృభాష తెలుగులో ఉంది’’ అంటూ మృణాల్ వాయిస్‌తో మొదలైన ఈ పాట.. నాని, మృణాల్‌ల స్వీట్, బ్యూటీఫుల్ ప్రేమకథను చూపిస్తూ పెద్ద వేడుకను సెలబ్రేట్ చేస్తోంది. ఈ సోల్ ఫుల్ మెలోడీ.. వారి పెళ్లి రోజు నుండి, వివాహ ప్రారంభ రోజులలో వారు కలసివున్న రోజుల వరకు, ప్రేమ యొక్క కొత్త అధ్యాయాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. ఈ పాటలో నాని, మృణాల్‌ల డిలైట్ ఫుల్ కెమిస్ట్రీ మెస్మరైజ్ చేస్తోంది. (Ammaadi Lyrical Video Song From Hi Nanna Out)


హేషామ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab) ఇన్స్టెంట్‌గా కనెక్ట్ అయ్యే మరొక ప్లజెంట్ నంబర్‌ను అందించారు. మొదటి రెండు పాటల్లాగే ఇది కూడా ఆల్బమ్‌లో మరో బ్లాక్‌బస్టర్ సాంగ్ అవుతుంది. కృష్ణకాంత్ ఆకట్టుకునే, మీనింగ్ ఫుల్ లిరిక్స్ అందించారు. కాల భైరవ, శక్తిశ్రీ గోపాలన్ ఈ పాటను ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ స్థాయిలో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీలో బేబీ కియారా ఖన్నా (Baby Kiara Khanna) ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదలయ్యేందుకు ఈ సినిమా ముస్తాబవుతోంది.


ఇవి కూడా చదవండి:

========================

*Atharva: ఫస్ట్ టైమ్ క్లూస్ టీమ్‌పై సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్సయింది

**********************************

*Kannappa: మంచు విష్ణు ‘కన్నప్ప’కు ‘జవాన్, బాహుబలి’ టచ్..

*************************************

*Karthi: ‘ఖైదీ’ ఎలా సర్‌ప్రైజ్ చేసిందో.. ‘జపాన్’ కూడా అంతే..

***************************************

*Satyabhama: ‘సత్యభామ’గా కాజల్.. టీజర్ ఎప్పుడంటే?

***************************************

Updated Date - 2023-11-04T20:25:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!