Allu Aravind: సాయిధరమ్ ఫోన్ చేస్తుంటే.. గీతా ఆర్ట్స్‌లో సినిమా అడుగుతాడనుకున్నా.. కానీ?
ABN, First Publish Date - 2023-04-11T16:53:19+05:30
తేజు ఫోన్ చేయగానే గీతా ఆర్ట్స్ (Geetha Arts)లో సినిమా చేస్తానని చెబుతాడేమో అనుకున్నా.. కానీ ఈ సినిమా గురించి చెప్పి..
తేజుకి యాక్సిడెంట్ అయినప్పుడు తనకు ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్స్.. ఎక్కడా మేజర్‌గా గాయాలు కాలేదు. తనకేం కాదు.. బతుకుతాడు అని 15 నిమిషాల్లో చెప్పారు. ఇప్పుడు ‘విరూపాక్ష’ చిత్రంలో ఇరగదీశాడని అంతా అంటుంటే సంతోషంగా ఉందని అన్నారు మెగా నిర్మాత అల్లు అరవింద్ (Mega Producer Allu Aravind). సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ (Virupaksha). సంయుక్తా మీనన్ (Samyuktha Menon) కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ (BVSN Prasad) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మంగళవారం (ఏప్రిల్ 11) ఈ సినిమా ట్రైలర్ స్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, దిల్ రాజు చేతుల మీదుగా విడుదలైంది. (Virupaksha Trailer Launch)
హైదరాబాద్‌లో జరిగిన ఈ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind Speech) మాట్లాడుతూ.. తేజు ఫోన్ చేయగానే గీతా ఆర్ట్స్ (Geetha Arts)లో సినిమా చేస్తానని చెబుతాడేమో అనుకున్నా.. కానీ ఈ సినిమా గురించి చెప్పి.. ట్రైలర్ విడుదల చేయాలని చెప్పాడు. తను పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. తేజుకి యాక్సిడెంట్ జరిగినప్పుడు.. తనకు ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్స్.. తేజుకి ఎక్కడా మేజర్‌గా గాయాలు కాలేదు. తనకేం కాదు.. బతుకుతాడు అని 15 నిమిషాల్లో చెప్పారు. తను అక్కడి నుంచి లేచి ఇప్పుడు విరూపాక్ష సినిమాలో చింపేశాడని అందరూ అంటుంటే వినటానికి చాలా సంతోషంగా ఉంది.
ఈ మధ్య సినిమాలకు ట్రైలర్‌ను బట్టి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ‘విరూపాక్ష’ ట్రైలర్ చూస్తుంటే ఓ రేంజ్‌లో ఓపెనింగ్స్ వస్తాయని 100 శాతం అనిపిస్తుంది. బాపినీడు, ప్రసాద్‌గారితో నాకు చాలా కాలం నుంచి జర్నీ ఉంది. దర్శకుడు కార్తీక్ దండు (Karthik Dandu) ఈ సినిమాను మన అందరికీ నచ్చేలా తీసుంటాడని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. అన్ని డిపార్ట్‌మెంట్స్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ‘కాంతార’ (Kantara) చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించటం హ్యాపీ. ఈ సినిమాకు అన్నీ కలిసొచ్చి ఎక్కడో నిలబడుతుందని భావిస్తున్నానని అన్నారు.
ఇవి కూడా చదవండి:
*********************************
*Raghava Lawrence: రామ్ చరణ్‌లో నాకు నచ్చింది ఏమిటంటే..
*Samantha: నేను ఫేస్ చేసిన సమస్యల వల్లే.. ఇప్పుడిలా మారిపోయా!
*NTR 2 NTR: ‘ఆది’.. జూనియర్ ఎన్టీఆర్ టు సీనియర్ ఎన్టీఆర్.. మాస్ అప్‌డేట్
*Renu Desai: నా బాధ అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నందుకు ధైర్యంగా ఉంది