Bachchala Malli: ‘పుష్ప’, ‘టైగర్ నాగేశ్వరావు’ బాటలో అల్లరి నరేష్.. క్లాప్ కొట్టేశారు
ABN, First Publish Date - 2023-12-01T15:45:58+05:30
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’, మాస్ మహారాజా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి సినిమాల బాటలో ఇప్పుడు అల్లరి నరేష్ ఓ సినిమా చేయబోతున్నారు. అల్లరి నరేష్ 63వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘బచ్చల మల్లి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ (Pushpa) సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలియంది కాదు. అలాగే రవితేజ (Ravi Teja) హీరోగా తెరకెక్కిన ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) సినిమా విడుదలకు ముందు ఎలాంటి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసిందో కూడా తెలిసిందే. ‘పుష్ప’, ‘టైగర్ నాగేశ్వరరావు’ల బాటలోనే ఇప్పుడు అల్లరి నరేష్ (Allari Naresh) నడవబోతున్నాడు. కొంతకాలంగా కామెడీని పక్కనెట్టి.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలక్ట్ చేసుకుంటున్న అల్లరి నరేష్.. ఇప్పుడో పెరటి దొంగ బయోపిక్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. అల్లరి నరేష్ పెరటి దొంగగా నటిస్తోన్న చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంది.
అల్లరి నరేష్ హీరోగా.. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ దర్శకుడు సుబ్బు మంగాదేవి (Subbu Mangadevi) దర్శకత్వంలో ‘సామజవరగమన’ మూవీతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న హాస్య మూవీస్ (Hasya Movies) బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli). రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తోన్న ఈ చిత్రం శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మేకర్స్ టైటిల్ లుక్ పోస్టర్‌ని కూడా వదిలి.. సినిమాపై ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్‌లో పూర్తిగా లోడ్ చేయబడిన ట్రాక్టర్ లోయలో పడిపోతున్నట్లు కనిపిస్తోంది. ట్రాక్టర్‌పై టైటిల్ రాసి ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో యాక్షన్ ఎక్కువగా ఉంటుందని అర్థమవుతోంది. ఈ సినిమా కోసం అల్లరి నరేష్ సరికొత్తగా మేకోవర్ అయినట్లుగా తెలుస్తోంది.
‘బచ్చల మల్లి’ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని తుని ప్రాంతానికి చెందిన పెరటి దొంగగా పేరు పొందిన వ్యక్తి ‘బచ్చల మల్లి’. అతని జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. 1990లో ఈ ప్రాంతాన్ని బచ్చల మల్లి హైజాక్ చేశాడు. అతని జీవితంలో జరిగిన సంఘటనలతో పాటు ఓ సామాజిక సమస్యకు సంబంధించి.. మంచి మెసేజ్ ఇందులో ఇవ్వబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అల్లరి నరేష్ 63వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆయన సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కోట జయరామ్, రావు రమేష్, సాయి కుమార్, ధనరాజ్, హరితేజ వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘సీతా రామం’ ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని మేకర్స్ తెలిపారు. పూజా కార్యక్రమాల్లో దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రానికి క్లాప్ కొట్టగా.. డైరెక్టర్స్ మారుతి, బుచ్చిబాబు యూనిట్‌కు కథను అందించారు.
ఇవి కూడా చదవండి:
====================
*చిత్రపరిశ్రమలో మాత్రమే కులమత భేదాలు లేవంటోన్న దర్శకుడు
************************************
*Double iSmart: మరో 100 రోజుల్లో థియేటర్లలో రచ్చ రచ్చే..
***********************************
*విలన్‌గా నటించాలనే కోరిక నెరవేరింది: యంగ్ హీరో
*************************************