సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Adipurush: సెన్సార్ పూర్తి.. ఏం సర్టిఫికేట్ వచ్చిందో తెలుసా?

ABN, First Publish Date - 2023-06-08T20:46:11+05:30

శ్రీరాముడిగా గ్లోబల్ స్టార్ ప్రభాస్, జానకిగా కృతి సనన్ నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికేట్ వచ్చినట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Prabhas in Adipurush
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీరాముడిగా గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Global Star Prabhas) నటించిన ‘ఆదిపురుష్‌’ (Adipurush) చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. విడుదలకు మరింత చేరువైంది. ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుందనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మొదటి ట్రైలర్, మొన్న తిరుపతి (Tirupati)లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుక.. సినిమాపై భారీగా పాజిటివ్ వైబ్స్‌ని క్రియేట్ చేశాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. ప్రభాస్ నటించిన సినిమా కావడం, ఆయన నుంచి సినిమా వచ్చి చాలా కాలం కావడంతో.. ఇది ఏ తరహా చిత్రమనేది కూడా ఫ్యాన్స్ పట్టించుకోవడం లేదు. థియేటర్స్‌లో బొమ్మ పడితే చాలు అన్నట్లుగా క్రేజ్ పెరిగిపోయింది. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ రావడంతో.. ఇప్పుడిది అందరి సినిమాగా మారిపోయింది.

ట్రైలర్ మరియు పాటలను బట్టి చూస్తే.. ప్రభాస్ మరియు కృతి సనన్ (Kriti Sanon) నటించిన ఈ చిత్రం కేవలం వినోదం కోసం రూపొందించబడలేదనేది అర్థమవుతోంది. భారతీయ పురాణాలలోని చాలా ముఖ్యమైన అంశం గురించి యువతరాలకు తెలియజేయడానికి ‘ఆదిపురుష్’ (Adipurush) వస్తున్నాడనేలా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలన్నీ.. సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. వాస్తవానికి ఈ చిత్రానికి సంబంధించి మొదటి టీజర్ విడుదలైనప్పుడు అంతా పెదవి విరిచారు. ఇదేం సినిమా అంటూ ఓం రౌత్‌ (Director Om Raut)ని ఓ ఆట ఆడేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ విఎఫ్‌ఎక్స్ విషయంలో యూనిట్ వర్క్ చేయక తప్పలేదు. ఆ వర్క్ తర్వాత వచ్చిన ట్రైలర్‌తో మెప్పించినా.. ప్రీ రిలీజ్ వేడుకలో విడుదల చేసిన ఫైనల్ ట్రైలర్‌లో కొన్ని షాట్స్.. మరోసారి యానిమేషన్ సినిమానే తలపించాయి. అయినా కూడా.. ఈ సినిమా అన్ని ఏరియాల్లో హాట్ కేక్‌లా బిజినెస్ చేయడం విశేషం. (Adipurush Censor Details)

ఇక సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికేట్ (U-Certificate) రావడంతో యూనిట్ అంతా చాలా హ్యాపీగా ఉంది. అధికారికంగా ఇది ప్రతి భారతీయుడికి చెందిన సినిమా (Prathi Bharatheeyudi Cinema)గా సెన్సార్ వారు సర్టిఫికేట్ ఇచ్చేసినట్లుగా వారు భావిస్తున్నారు. కాగా.. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ ఆదిపురుష్ చిత్రాన్ని.. టి-సిరీస్ భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ మరియు రెట్రోఫిల్స్‌కు చెందిన రాజేష్ నాయర్.. అలాగే యువి క్రియేషన్స్‌కు చెందిన ప్రమోద్, వంశీలు నిర్మించారు. ఈ సినిమాని పీపుల్ మీడియా సంస్థ తెలుగులో విడుదల చేయనుంది.

ఇవి కూడా చదవండి:

************************************************

*Bhagavanth Kesari: జూన్ 10న బాలయ్య ఫ్యాన్స్‌కి మాస్ ట్రీట్.. ఇక్కడా 108కి లింక్!

*Sharwanand: రిసెప్షన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన శర్వా..

*Adipurush: తిరుమలలో ‘ఆదిపురుష్’ డైరెక్టర్, హీరోయిన్‌ల వ్యవహారంపై కేసు

*Adipurush: దళితులకు ప్రవేశం లేదు.. ఫేక్ పోస్టర్ హల్‌చల్.. స్పందించిన మూవీ టీమ్

*Gandheevadhari Arjuna: వరుణ్ తేజ్ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్సయింది

Updated Date - 2023-06-08T20:48:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!